varuNiDi nestam

వరుణిడి నేస్తం----------------
దేవతలంతా పోట్లాడుకుంటున్నారు,
ఇంద్రుడికి తలనొప్పిగా తయారైంది.
స్వర్గం ఓ నరకంలా కనిపించసాగింది
గ్రూపు రాజకీయాలతో స్వర్గం అట్టుడికి పోతూంది.
బ్రహ్మ,విష్ణు , మహేశ్వరుల అధిష్టానానికి తెలియచేయాలా అన్న సందిగ్దంలోపడ్డాడు ఇంద్రుడు.
ఇంతకీ స్వర్గంలో అంత కల్లోలానికి దారితీసిన కారణాలు ఏమిటి?
భూలోకంలో ఆంధ్ర రాష్ట్ర్హంలో మొదలైన జలయజ్ఞం తో మొదలైంది.
ఆ జలయజ్ఞం లో స్వర్గం నుండి ఓ అమ్రుతధార జారి తొడ్పడం తో దేవతల ఆయుష్హుకే దెబ్బ అయింది.
అమ్రుతం కరువై దేవతలు మామూలు మనుష్యులైపొయారు!
అమ్రుతాన్ని కోల్పొయేలా చేసిన ఇంద్రుడికి స్వర్గాన్ని ఏలే అర్హత లేదని వారి వాదన!
అతన్ని తప్పించి మరో నాయకుడిని ఎన్నుకోవాలని వారి తాపత్రయం!
అధిష్టానికి అర్జీ పెట్టారు!
మరో నాయకుడి కోసం గాలింపు మొదలైంది!!అన్నివర్గాలవారికి, అన్నివిధాల సహయపడే నాయకుడు కావాలి.
వ్యక్తి,వర్గ భేదం లేకుండా అన్నిటి అభివ్రుద్దికి క్రుషిచేసే మనిషి కావాలి..
పథకాలను ధ్యైర్యంతొ అమలుచెసే అభయహస్తం కావాలి!
దేవతలందరి జీవితాలలోనూ వెలుగునింపే తేజోరాసి కావాలి
అన్ని వయసుల వారికీ అహర్నిసలూ లాభం చేకూర్చే పథకాలను తీసుకురావాలి!
అంతేకాదు,అలాటి పథకాలను అమలుచేయడానికి సాహసొపేత నిర్ణయాలు తీసుకొగలగాలి.
ఇలా సంక్షేమ, అభివ్రుద్ది కార్యక్రమాలను చేపట్ట గలిగేలా , ఒక రాజకీయచతురుడి వేటలో ,తారసపడ్డాడు వారికి ఆంధ్ర రాష్త్రముఖ్యమంత్రి రాజశేఖరుడు!!
అన్ని అర్హతలూ వున్న వాడు, మాటకోసం మడిమతిప్పని వాడు!ప్రతిదీ చిరునవ్వుతొ జయించేవాడు!
మరి అతన్ని రప్పించుకోవడం యేలా?
వెంటనే అతని సన్నిహితుడి కోసం వేట మొదలైంది!
అతడికి అన్నివిధాల తోడైనవాడు వరుణుడని తేలింది.వరుణిడిని సంప్రదించారు.కాని వరుణుడు "అతను నాకు అత్యంత ప్రియ మిత్రుడు..నేను అతన్ని స్వర్గానికి తీసుకువస్తే ప్రజలు దుమ్మెత్తి పొస్తారు అని ..ససేమిరా.."అన్నాడు.
దేవతలకు ఏమిచెయ్యాలో తోచలేదు.
మేధావుల్ని సంప్రదించారు.
ఓ పథకాన్ని ఆలోచించారు.
రాజశేఖరుడి జాతకాన్ని పరిశీలించారు.అతనికి కలసిరాని వాస్తు నిర్ణయాలు జరిగేలా చూసారు.బుదవారం,వర్షం అతని జాతకానికి అశనిపాతం అని గుర్తించారు.జూలైలో వచ్హే చంద్రగ్రహణం,సంపూర్ణ సూర్య గ్రహణం గడియలలో నాంది ముహూర్తం పెట్టారు.వ్యతిరెఖ ఫలితాలకు ఎదురుచూసారు.వారు కోరుకున్నట్టే బుధవారం, వర్షం రోజున 'రచ్చబండ ' కార్యక్రమం అంటూ హెలికాప్టరులో బయలుదేరాడాయన!
ఇంతా చేసిన తరుణంలో వరుణుడు నేనీపని చెయ్యను అని మొరాఇంచాడు.
అందుకే అతను బయలుదేరినప్పుడు వర్షం లేదు.దేవతలంతా అతను స్వర్గానికి రావడం ఎంత ముఖ్యమో వరుణిడికి వివరించారు.కొంతవూరట చెంది వరుణుడు ప్రతికూల పవనాలను సౄష్టించాదు.
ఒకవైపు వర్షం,దిగువ దట్టమైన నల్లమల అడవులు, కనుచూపుమేరలో క్రిందికిదిగడానికి వీలుకాకుండా జాగ్రత్తపడ్డారు దేవతలు.హెలికాప్టరుకు సాంకేతికలొపాన్ని కలిగించారు.దట్టమైన మేఘాల్ని అడ్డుపెట్టారు!
ముందు కానరాక ,వెనుతిరగలేక,కొద్దిగా క్రిందికి దిగితే ఓ చెట్టుని కొట్టుకొని 'డాం!' అని పేలిపొయింది హెలికాప్టరు.
ఒక్కసారిగ రాజశేఖరుడి ఆత్మ పైకి ఎగసింది.ఎగసిన అతని ఆత్మను పూలరథంలో కూర్చుండపెట్టారు దేవతలు.అత్యంత ఆనందంతో అధిష్టాన ఆస్థానానికి రివ్వున వెళ్లారు!
భూమి మీద అతని అభివ్రుద్దికి ఎంతొ తొడ్పడిన వరుణుడే అతన్ని భూమికి, అతని ప్రజలకు దూరం చేసానని బోరున విలపించాడు.ఇడుపుల పాయల చేరుకుని స్తబ్దుగ కలియచూసాడు.తన మిత్రుని ఖననాన్ని నిశ్సబ్దంగ తిలకించాడు.గుండె బరువై ఇడుపులపాయలొ బోరున విలపిస్త్తూ కన్నీళ్ళు కార్చాడు!!
ఆపై స్వర్గానికి వెడితే రాజసం వుట్టిపడుతూ, అదే చిరునవ్వుతో అతన్ని చూసి అత్యంత ఆనందాన్ని అనుభవించాడు! ఆప్యాయంగా అతడిని స్ప్రుశించాదు.
'ఎలా వున్నావు మిత్రమా" ఆప్యాయతతొ కూడిన పలకరింపు విని తలదించుకున్నాడు.
"బాధపడకు మిత్రమా..నీవు నా వొక్కడికొసం కార్యం నిర్వర్థించావు. ప్రజలు నన్ను వీడలేదు చూడు 350 మంది నాకోసం వచ్హారు ,ఇక ఇక్కడ కూడా మంచి కార్యక్రమాలు చేపడదాం. నీ సహయం కావాలిసుమా.." అంటూ చిరునవ్వు నవ్వాడు.
స్వర్గం లో దేవుడిలా వెలుగొందుతున్న రజశేఖరుడిని చూసి సంతొషపడి ఈవార్త ఆంధ్ర రాస్ట్రానికి తెలియచేస్తనంటూ సుడిగాలిలా క్రిందికి దిగాడు వరుణుడు.కుంభవ్రుష్టి లా కురుస్తున్న వర్షమే అతని భాష అని తెలియక రాజశేఖరుడిని కొల్పోయామని బొరున విలపిస్తూ నే వున్నరు యావత్ తెలుగువారు!!!.


Reply Reply to all Forward

మేలుకో ప్రభూ!!

------------------

ఏడూకొండలవాడు,ఆపద మొక్కులవాడు,

అఖిలాండకొటీబ్రహండ నాయకుడు,

అతని ఆర్జన భారతదేశంలొ రికార్డు!

ప్రపంచంలొ వెటికన్ కు పోటిదారు!!

పెళ్ళీ కోసం కుబేరునితో కాసులబేరంచెసినవాడు !!

భక్తజనరక్షకుదు !అందుకే 'క్షణం' దర్శనానికిబోలెడు ముడుపులను చెల్లింపచే సుకునేవాడు!!!

భక్తుల నిలువుదోపిడీలేకాదు, వజ్రకిరీటాలు,వజ్రహారాలు కుఆడా కానుకలె !!

అందుకే మూడొందల డాలర్ల లెక్కదొర్లిపొయినా వుల్లిక్కి పడలెదు !!!

తన సామ్రాజ్యంలొ కోదండరాముని ఆలయంలోపూజారే ఆభరణాలు తాకట్టు పెడితే

కన్నులు మూసుకొని చల్లగానే వున్నాడు !!

పూజారి కష్టాలకు ఆవిధంగా సహాయ పడెనా!!లేక అతని పాపాలకు పరాకాష్ట కావించెనా !!

వున్న నగలు యెక్కువై , తనికీలు కరువై

కొనేటి రాయడు కలికాలంలొకర్పూర నామం వెనుక కనులు మూసి నిదురించెనా!!

చెవుల ఆ భరణాలు, అవినితి, అక్రమాలను వినిపించకుండా చేసెనా !!

అమ్మవారి వియోగంతొ ఆదమరిచెనా?

భక్తుల రక్షించే ఆపదమొక్కులవాడా

కొట్ల విలువ చెసె నే ఆ భరణాలనేకాదు

వేల యెకరాల నీ భూమి కబ్జాలను పరికరించు

నల్లధనానికి నీ హుండి పచ్హదారి కానివ్వద్దు

అధర్మం పెరిగిపొతూంది , ధర్మాన్ని రక్షించేకాలంఆసన్నమైంది

మేలుకో ప్రభూ!!
Rachana- lakshmi raghava 3-99, appagari street,kurabalakota-517350chitoor dist-AP

అమ్మవారి ఆవేదన

అలివేలుమంగమ్మ అలిగికూర్చుంది!

వెంకటేశ్వరుదు ఏడుకొందలూ దిగివచ్హిఎంత అనునయించినా అలకతీరలేదు!

చివరకు గళం విప్పింది అమ్మవారు!

సీతమ్మ వారిని పేరంటానికి పిలవాలనికోదండరాముడి ఆలయానికి వెడితే

నగలు తాకట్టులొ వున్నాయని సీతమ్మ ఆవేదన!

తాకట్టూ స్వామివారి అనుమతి తొనే అన్నాడట పూజారి!

మరి,మీ వారి మూడొందల డాలర్లు కూడా తాకట్టేనా? అని ఆరా!

యేమని సమధానం చెఫ్ఫాలి?

నగలన్ని తాకట్ట్లకూ,దొపిడీలకు వెడితే యెలా స్వామి?

మన పదకొండున్నర టన్నుల బంగారం క్షేమమేనా?

ఇలా కోట్లాది రూపాయలు గల్లంతయెతేరేపు కుబేరుని అఫ్ఫు తీరెదెలా?

బొఖ్ఖసం తాళాలైన భద్రపరుచుకోవాలి కదా!

మీ కళ్ళ కు కస్థూరి నామంతొ గంతలు కట్టి

మీ మొలతాడు కూడ తెంచుకు పోతారేమొ !

మీ చెవులకు అడ్డంగా ఆభరణాలు కఫ్ఫిఅవినీతి ,అక్రమాలను మీ చెవిని పడకుండా చెస్థున్నారు!

పొనీ శివుడిని సలహా అడుగుదామంటె

ఇంటి దొంగలను ఈశ్వరుడిన పట్ట లేడంటారు!

ఈసారి శోధించి పరిశొధించీ కారకులెవరొ తెలుసుకుని

వారి పాపాలకు పరాకాష్టా కావించి,శిక్షించండి ప్రభూ!

దేవుడు కళ్ళు మూసుకొలేదని నిరూపించండి!!

kathaku prize

anukokunda naa kathaku prize vachiindi adikuda RACHNA lo . kathalu rayadum malle modalinappudu prize ravadam voka boost. andariki cheppukovalani aasa vunna naa blag yevavu chustharo theliyadu....anduke nirasa.....blog prapanchamlo yedigedi yelago yevaraina chebithe baguntundi...

http://www.koumudi.net/Monthly/2009/october/index.html

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template