ఎవరి అభిప్రాయం వారిది

హైదరాబాదు లో చదువుకుని అక్కడే నగరం నడిబొడ్డున వున్నా కాలేజీ లో  ఉద్యోగం చేస్తూ  ఎన్నో కర్ఫ్యూ లను ఎదుర్కొన్న రోజులు పోయి ..వరస బాంబు పేలుళ్ళతో అట్టుడికిన  ఇప్పటి హైదరాబాదు ను ఉహించుకుని రాసినదే ' 'ఎవరి అభిప్రాయం వారిది ' అన్న కథ . విహంగ అంతర్జాల పత్రిక జులై నెలలో పబ్లిష్ అయినదీ కథ !
ఈ క్రింది లింకులో చదివి మీ అభిప్రాయం తెలపండి.


ఆగిన అత్త గారి సెంచురీ పరుగు.....

ఆగిన అత్త గారి సెంచురీ పరుగు
------------------------------------------------------------------------------------
జనవరి 2013 లో తొంబై ఏళ్ళ అత్తగారు
అనారోగ్యం తో ఆస్పత్రి పాలు !
ఊపిరి అందక ఎగపోత,
ఆగనా  అంటూ గుండె ,
పరుగెడలేను  అంటూ  బి.పి,....భయపెట్టారు చాలా.....
ఏమో ...ఎప్పుడో..చెప్పలేం అని
చేతులెత్తేసిన డాక్టర్ల అంచనా తారుమారు చేసి ,
ఊపిరి తిత్తుల శక్తి పెంచేసుకుని, గుండె లయ సరిచేసుకుని ,
వేగాన్ని పుంజుకున్న బి.పి తో ..
‘ఇది నా సెంచురీ కోసం పరుగు’ అంటూ ఇల్లు చేరారు అత్తగారు !!!
డైపర్లను వదిలించుకుని, టానిక్కులతో  శక్తి పెంచుకుని
ఆకలి ఎక్కువై..అనుక్షణం ‘ తిండి పెట్టవే కోడలు పిల్లా ‘ అంటూ
నన్ను పరుగులు తీయించి ....
అర్ధరాత్రి కూడా హార్లిక్స్ లతో కడుపు నింపుకుంటూ
నా నిద్రను పాడు చేసినా ...
‘సెంచురీ కై పరుగు కదా , ఆమాత్రం నాసాయం వద్దా’ అనుకుంటూ చేసాను సేవలు చాలా ..
ఆరు నెలల్లో ఆవిడ తయారైన తీరు అద్భుతం అనుకుంటూ వుండగా
జూన్ ఆరు తెల్లవారు జామున ‘ నన్ను పిలుస్తున్నారు నేను వెళ్ళాలి ‘ అని
ఆవిడ అంటే ‘సెంచురీ పరుగు కదా ..అప్పుడేనా వెడుదురు గానీ ‘అంటే
సరేనంటూ’ ఆరోజు కార్యక్రమాలు ముగించుకుని
రాత్రి పడుకుంటానంటూ  చెప్పిన ఆవిడ
నిశ్శబ్దంగా అర్ధరాత్రి పరుగు చాలించుకుని ,
సెంచురీ వద్దనుకుని
పరలోకానికి పయనమై వెళ్లారు ...
బోసిపోయిన ఆవిడ రూమూ ,
పరుగులెత్తిన నేను...

మరచిపోలేని ఆవిడ జ్ఞాపకాలు  మిగిలాయి ....
ఆసరా తోనే జీవితం


            ఆసరా తోనే జీవితం
అమ్మ కనేంత వరకు బొడ్డు తాడు ఆసరా ,
బయటకు వచ్చాక అమ్మ ప్రేమ ఆసరా ,
చదువువ కోవడానికి  నాన్న పాఠాలు ఆసరా ,
ఎదగడానికి ఉద్యోగం ఆసరా ,
డబ్బుకోసం పరాయి దేశం ఆసరా ,
సంసారపు సుఖాల కోసం భార్య ఆసరా ,
సంతోషాలను పంచి ఇచ్చేందుకు పిల్లల ఆసరా ,
వారి ఉద్యోగాల పేరుతో ‘ఆశ’ ఆసరా,
రిటైర్మెంట్ తరువాత పెన్షను ఆసరా ,
భార్యా వియోగంతో కొడుకు పంచన చేరితే  కోడలు ఆసరా,
కోడలి ‘రుస రుస  ‘ తో బాధ ఆసరా ,
ఒత్తిడిలో స్వాంతన కోసం ‘ మద్యం’ ఆసరా ,
మృత్యువు దరిచేరబోయినప్పుడు  ‘మోక్షం’ కొరకు దేవుడి ఆసరా ,
పునర్జన్మ తో మళ్ళీ కొత్త జీవితం ఆసరా! 

సిగ్గు ...సిగ్గు ..మళ్ళీ అత్యాచారమా?


              సిగ్గు.... సిగ్గు....
మళ్ళీ అత్యాచారం ....అయిదేళ్ళ బాలికపై ...
అమ్మ నాన్నల మధ్య హాయిగా నిదురించవలసిన బిడ్డ ,
అమానుష ,  పైశాచిక  అత్యాచారంతో బందీ.....
సిగ్గు ...సిగ్గు ...ఈమాటకు అర్థం కూడా తెలుసనుకోవడం   ఇంకా సిగ్గు చేటు ....
రోగగ్రస్త సమాజం పై ఏవగింపు ...
నిర్భయ చట్టం ఎక్కడ ?
ఏ చట్టం ఆపుతోంది ఈ అత్యాచార సంస్కృతిని ?
నైతికత అంతం చెందిన ఆటవిక జాతి మనది.....
ఈ జాతి కోసమా నిరసన జ్వాలలు ?
కొవ్వొత్తుల ప్రదర్సనలు?
ఆందోళనలు ?
అత్యంత పవిత్రమైన భారతదేశమే నా ఇది?
ఇదేనా మన సంస్కృతీ ? 

ఈ రోజు న మా వూరిలో ఓక అద్భుతం !!

 మా రాయలసీమ పల్లెలో వడగళ్ళ వాన కురిసింది !
మా పంటలు పచ్చగా వున్నాయి !
మాకు కరెంటు కోత లేదు.!
తాగడానికి మినరల్ వాటర్ ఇస్తునారు !
పెట్రోలు ధరలు తగ్గిపోయాయి !
రైతులకు బ్యాంకుల్లో కావాల్సినంత ఋణం దొరుకుతోంది !
మా ఆడపిల్లలు అర్ధరాత్రి బయట తిరుగుతువున్నారు!
మగవాళ్ళు వారిని చూసి భయపడి పోతున్నారు!
మా ఏడు కొండల దేవుడు పదినిముషాల్లో దర్సనం ఇస్తున్నాడు!!!!!

ఎంతబాగుందో...........

అవునండీ   ఈరోజు ఏప్రిల్ ఒకటి ఎన్ని అధ్భుతాలైనా జరగవచ్చు !!
ఉహల్లో బతికేద్దాం !!!!!

 ఈమధ్య తిరుమలలో  V I P దర్శనాల లిస్టు గమనించారా ?
రోజు కు ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తులు  ఏడుకొండలవాడి దర్శనాలకి వస్తున్నారు . ఎందు కంటారు ?  
న్యాయ పరంగా జడ్జిమెంట్ లు బాగా ఇవ్వాలనా /?  
 మాతృ బాష లో బాగా రాయ గలగాలనా ?  
 దేశంలో న్యాయం లోపిస్తుంది కాపాడమనా ?
 ఈకష్టాలన్నీ మాకే ఎందుకనా?   ఏమైవుంటు దబ్బా.....

విహంగ జాల పత్రికలో నా కవిత-మహిళ అవసరం

http://vihanga.com/?p=7425


మహిళ అవసరం
భార్యా భర్తల క్షణికావేశం లో 
కలవబడిన ఏక కణరూపం,
అతిత్వరగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో
స్కానింగు ల నాశ్రయించి,
అక్రమాలకు ఆజ్యం పోసి ,
అసంపూర్ణ ఆడబిడ్డను తెగ కొస్తే
పాపం వూరక పోదు ఎన్నడూ !
ప్రేమికుల క్షణికా నందం  లో  ఏర్పడే
అక్రమ సంతాన్నాన్ని క్రమీకరించ ధైర్యం లేక ,
ముళ్ళ పొదల్లో నేట్టివేయబడ్డ
తిరస్కర భాదిత ఆడబిడ్డ ,
అవరోధాల్ని దాటుకుని అడుగులు వేసే స్థితి లో ,
అత్యవసరంగా చక చకా ఎదిగేయ్యాలనీ ,
రాజధాని నడిబొడ్డున  అత్యాచారం పాలైన
నిర్భయ లా కాక ,
అపర కాళి లా కదం తొక్కాలని
తన శక్తిని బహిర్గతం చేస్తూ
పురుశాదిక్య ప్రపంచానికి.
అమ్మదనాన్నే దూరం చెయ్యాలని .
అమ్మకణం కోసం వెంపర్లాడితే తెలుస్తుంది
మానవాళికి మహిళా ఎంత అవసరమో !!!!!!!


రచన – లక్ష్మి రాఘవ [ Dr. K.V. Lakshmi ]

మార్పు కు నాంది మహిళ


              మార్పు కు నాంది మహిళ
అప్పడు ---భారత దేశం లో భార్యగా త్యాగం ,
              తల్లిగా అనురాగం ,
             ఆడ జన్మ పవిత్రం ,
              అయినా తప్పలేదు కష్టాలు ,

             వరకట్నానికి  బలికాకుండా,
            కిరోసేన్ అగ్నికి ఆహుతి కాకుండా ,
             ఫ్యాను కడ్డీలను ఆశ్రయించకుండా
             బతికేదెలా అని భయపడ్డది ఆడ బ్రతుకు .

ఇప్పుడు--- ఆసిడ్ దాడులతో ,
               ప్రేమపిచ్చి ఆవేశాలతో ,
               కామ పిశాచుల కోరికలతో ,
               రాజధాని నడి  బొడ్డున
               పరాభావింప బడ్డాక ,
               వురుకోకు మహిళా

ఎందుకంటే ---శిక్షలు ప్రభుత్వానివే అయినా
                 క్రమశిక్షణ ఎప్పుడూ తల్లిదే
                 ప్రేమా అనురాగాలూ
      అణుబాంబు కన్నా శక్తిమంతాలు .
      అనురాగ మూర్తిగా చేతన కలిగించు
      అపర శక్తివై చైతన్యం తెప్పించు,
      ఇది చెయ్యగలిగేది ఒక్క ఆడదే ,
      అత్యంత శక్తి స్వరూపిణి ఆడది ,
      అబల కాదు సబల అని నిరూపించేది
     సంఘం లో మార్పుకు పునాది వేసేది మహిళే ! 


మహిళా దినోచ్చవ సందర్బంగా  రాసిన ఈ కవిత ఇన్నిరోజులకు వెలుగు చూసింది !
  

అత్తగారి ఆయుస్సు


        అత్తగారి ఆయుస్సు
పండుటాకు అత్తమ్మ ,
తొంబై వసంతాలు నిండి ,
దేహపు ముడతల్లో వయసు తెలిసి
నిటారుగా నిలబడే శక్తి లేక ,
ఆసరా కోసం చేతులు చాపుతూ,
అన్నం కుడా కలుపుకోలేక,
చేతులు పనిచేయ్యక,
స్పూను తిండికి అలవాటు పడుతూ
చాలు బాబూ ఈ జీవితం  అంటూ
నాలుక బయట కేసి ,కళ్ళు తే లవేసి
ఊపిరి గురగురలాడుతూ ,
స్వేచ్చ కావాలని ఎగిరిపొయె సమయాన’
గాబరా పడి కేకవేస్తే
108  వున్నపళాన వచ్చి
ఆదరంతో ఆక్సిజన్ ఇచ్చి
ఆస్పత్రికి చేరవేస్తే
ICU  లో అడ్మిటై
మృదువుగా ఇచ్చిన అనేక ఇంజెక్షన్ల తో,
వివిధ రకాల ట్యూబులతో ,
ఆవిడ అంతరంగాన వున్న ప్రతి అవయవాన్ని
 చరిచి లేపి పనిచేసేలా చేసాక ,
పదిరోజుల ICU ప్రస్తానం ముగిసి వార్డు చేరిన అత్తగారు
‘ ఇకపోదాం పద లక్ష్మి ఇంటికి’ అని వినసొంపుగా
పలికిన వేల సంతోషం నిండి
‘మరో పదేళ్లు జీవించి శతకం పుర్తిచేయ్యండి అత్తగారూ’
అని దేవుడినకోరిన వేళ
15రోజుల అలసట
ఆస్పత్రికి ఎగిరిపోయిన బరువైన డబ్బూ
ఏదీ గుర్తుకు రాలేదంటే నమ్మండి !!!

{ జనవరి 3 to 16 ,2013 రోజులలో మాఅత్తగారి అనారోగ్య –ఆరోగ్య ప్రహసనం ]


Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template