ప్రభుత్వం ---ఉచిత సలహాలు
1 ] కరెంటు కోత గురించి ఆలోచించవద్దు .
మరీ
ఉక్కపోస్తే కిటికీలు తెరిచి పెట్టుకోండి .
చల్లని
గాలిని చక్కగా అనుభవించండి .
ఆరుబయట
దోమతెరలు కట్టుకుని హాయిగా నిదురపో ౦డి
2] కరెంటు ఆదా
చెయ్యండి .
ఆదా ఎలా చెయ్యాలో నేర్చుకోండి
౧] హై మాస్టు దీపాలు మాని ట్యూబు
లైట్లు వెలిగించుకోండి
అదీ వీలు లేకుంటే కిరోసిన్ తో బుడ్డి దీపాలు పెట్టు కొండి
౨] గీజర్లు వాడడం మానండి .
చన్నీటి స్నానం కు అలవాటు పడండి
ఆరోగ్యానికి ఆరోగ్యం ....ఆదా కి ఆదా
౩] వాషింగు మిషన్లు వాడటం మానండి .
ఒక అరగంట చేతికి పని చెప్పితే బాగా మురికి పోయి
మీ బట్టలు మెరుస్తాయి !!!
అంతే కాదు శరీరానికి మంచి excersise కూడా .
ఆరోగ్యం ఇంకా మెరుగు పడుతుంది
౪] రెఫ్రిజిరేటర్ వాడ వద్దు .
దీని మరో పేరు సద్దిపెట్టె..దీని ఆఫ్ చేస్తే కరెంటు ఆదా నే కాదు ,
సద్ది కూడు తినే బాధ తగ్గుతుంది !!
ఏ పూట కా పూట తాజాగా చేసుకు తింటే
ఆరోగ్యం మరింత మెరుగు !!
౫] టి. వీ లు చూడటం మానండి .
ఇంటి అరుగు మీద కూర్చుంటే బోల్డు కబుర్లు !
ఏళ్ళ తరబడి ససేషం గా నడిచే టి వీ సీరియళ్ళ కన్న
ఎప్పటికప్పుడు తాజా గా సమాచారం ,
రోజు కో కొత్త కథనం ..లభ్యం !!
౬]
మైక్రో అవన్లు మానెయ్యండి .
చిన్న బొగ్గుల కుంపటి కొనుక్కోండి
వేడి
చేసు కోవడం సులభమే కాదు , చాలా డబ్బు ఆదా కూడా
చక్కటి ప్రకృతి లో స్వేచ్చ గా గాలిని
ఆస్వాదిస్తూ , చన్నీటి స్నానంతో ఆరోగ్యాలు
చక్కబడి ఎంతో శక్తి వస్తుంది . అప్పుడు ఆలోచనలు మారతాయి .
వర్షాలు లేకనే కదా ఇన్ని కష్టాలు !!
వరుణ దేవుడిని కరుణించమని వేడుకుందాం ,ఆయనకీ “ క్విడ్ ప్రో కో “గురించి చెబుదాం
ఆయనమనకు వర్షం ఇస్తే ఆయనకు మనం ఏమీ ఇస్తామో డిస్కస్ చేద్దాం..అయినా న్యాయ
నిర్నేతలే
“బెయిలు” కొసం కోట్లు తినడం సాద్యం
అయినప్పుడు ..దేవుడిని లొంగ తీసుకోలేమా ?
ఆలోచిద్దాం ..
ప్రభుత్వం మంత్రుల పై చార్జిషీట్ల తో ,
వాళ్ళ రాజీనామాలతోను , బొగ్గుల రాజకీయాలతో బిజీగా వుందికదా ..
మనతిప్పలు మనమే పడదామా?
6 comments:
భలేగా రాశారండి.
thank you krishna garu
మీ ఉచిత సలహాలు బావున్నాయండి.
thank you saila bala
lakshmi raghava
mee uchita salahaalu baagunnai...
baammaa maataa bangaaru baataa...
thank you...మీరు నా నేస్తమైపోయ్యారు . అప్పుడప్పుడూ పలకరించండి
Post a Comment