అమ్మవారి ఆవేదన

అలివేలుమంగమ్మ అలిగికూర్చుంది!

వెంకటేశ్వరుదు ఏడుకొందలూ దిగివచ్హిఎంత అనునయించినా అలకతీరలేదు!

చివరకు గళం విప్పింది అమ్మవారు!

సీతమ్మ వారిని పేరంటానికి పిలవాలనికోదండరాముడి ఆలయానికి వెడితే

నగలు తాకట్టులొ వున్నాయని సీతమ్మ ఆవేదన!

తాకట్టూ స్వామివారి అనుమతి తొనే అన్నాడట పూజారి!

మరి,మీ వారి మూడొందల డాలర్లు కూడా తాకట్టేనా? అని ఆరా!

యేమని సమధానం చెఫ్ఫాలి?

నగలన్ని తాకట్ట్లకూ,దొపిడీలకు వెడితే యెలా స్వామి?

మన పదకొండున్నర టన్నుల బంగారం క్షేమమేనా?

ఇలా కోట్లాది రూపాయలు గల్లంతయెతేరేపు కుబేరుని అఫ్ఫు తీరెదెలా?

బొఖ్ఖసం తాళాలైన భద్రపరుచుకోవాలి కదా!

మీ కళ్ళ కు కస్థూరి నామంతొ గంతలు కట్టి

మీ మొలతాడు కూడ తెంచుకు పోతారేమొ !

మీ చెవులకు అడ్డంగా ఆభరణాలు కఫ్ఫిఅవినీతి ,అక్రమాలను మీ చెవిని పడకుండా చెస్థున్నారు!

పొనీ శివుడిని సలహా అడుగుదామంటె

ఇంటి దొంగలను ఈశ్వరుడిన పట్ట లేడంటారు!

ఈసారి శోధించి పరిశొధించీ కారకులెవరొ తెలుసుకుని

వారి పాపాలకు పరాకాష్టా కావించి,శిక్షించండి ప్రభూ!

దేవుడు కళ్ళు మూసుకొలేదని నిరూపించండి!!

0 comments:

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template