నిక్కరు

                  
                  నిక్కరు
“పండగకు నాకు నిక్కరు వద్దు” ఏడుపు గొంతుకతో అన్నాడు ఏడేళ్ళ శీను.
“ఏం?”
“ప్యాంటు కావాలి .....”
“నాలుగో  క్లాసు దాటలేదు...ప్యాంటు కావాలా?”  కోపంగా వుంది నాన్న గొంతు.
“గోపి ప్యాంటు వేసుకుంటాడు...”
“వాడితో నీకేమినోరు మూసుకుని తెచ్చింది వేసుకో “ నాన్న మాటకు తిరుగులేదు.
శీను ఏడుస్తూనే నిక్కరు వేసుకున్నాడు ఉగాది రోజు..
*******                          *******
“నిక్కరు కావాలి...” మెల్లిగా అన్నాడు శీను.
“నిక్కరు కావాలా??”
“అవును”
“నిక్కరు వేసుకుంటారా?” ఆశ్చర్యం!
“ఆ....”
మాల్ లోకి రవి తో పాటు వెళ్లి నిక్కరు కొనుక్కుని రావటం అయ్యింది.
కొత్త నిక్కరు వేసుకుని మురిసిపోయాడు శ్రీను అనబడే శ్రీనివాస రావు.
అమెరికాలో వున్న కొడుకు రవి దగ్గరికి వచ్చిన తరువాత అతడు కోరిన మొదటి కోరిక ఇది!
ఇప్పుడతని వయసు అరవై!!!!
                                                                                రచన -డా. లక్ష్మి రాఘవ 
******                            *****                    ******   
https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif


******                            *****                    ******   
https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif


******                            *****                    ******   

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif


ప్రేమించడానికి ప్రత్యెక దినం అవసరమా?

నాకు నా కుటుంబం ఇష్టం మా ఆయనా, నాపిల్లలు అల్లుడ్లూ , మనవలూ మనమరాండ్లూ అందరి మీదా అనుక్షణం ప్రేమే.. ప్రపంచమే ప్రేమ మయం ప్రేమించడానికి ప్రత్యెక దినం అవసరమా?

కాలం మారింది చాలా

కాలం మారింది చాలా - -------------------_ మనసు చిత్రమైనది.... జ్ఞాపకాల చిట్టా తీస్తూనే వుంది .... 60 ఏళ్ళుముందటి పుటల్ని వెదికి పట్టు కుంటూనే వుంది.... పది మంది పిల్లల లో ఒకరిగా పొద్దున్న లేచి స్నానాల గదికి క్యూలు, జడలు దువ్వించు కోవడాలు... సామూహిక టిఫన్లు, బడులకు పరుగులు... సాయంకాలాలు తోక్కుడు బిళ్ళలు, గోళీకాయలు, కాస్సేపు చదువులు, అమ్మ చేతి కలిపి కడులు, బామ్మ చేత తోకచుక్కల కథలు...వాహ్ !! కాల క్రమాన సోంత పిల్లలు... జడలు వేసే టైము లేక హెర్ కట్ లు, లెక్కలు చెప్పించలేక ట్యూషన్లు, ఇంకా పైన ఎంసెట్ కోచింగులు.. ఇంజనీరింగు చదువుల కోసం పాట్లు... చదువు లయ్యాక అమెరికాకు ఎగిరిన రెక్కలు.. గలగలలా సందడికి ఆనకట్ట నిశ్శబ్దం ఆవరించిన ఎన్నొదినాలూ... ఫోన్ల కోసం ఎదురు చూపులు! కాలం పరుగులు తీస్తూనేవుంది ... పెరిగింది టెక్నాలజీ...కంప్యూటర్లు..లాప్ టాప్లూ ఐ పాడ్ లూ , సోషియల్ నెట్ వర్క్లూ.. వేబ్ కెమరాలు పోయి ఫేస్ టైములూ.. నేరుగా చూడగలిగే అవకాశాలూ , మనమల బర్త్ డే లకు వేరువేరు లోకేషన్లు , పూల్ పార్టీలు, స్పా పార్టీలు, బౌన్సింగ్ ప్లేసులూ, విడియో గేములూ , ఎక్స్ బాక్సులూ, కోరినన్ని బట్టలూ,కోరికలకు మించిన వసతులు, హటాత్తుగా జ్ఞాపకాల పేజీలలో వెనక్కి పరుగులు... అమ్మ చిరునవ్వుల జ్ఞాపకాలు... పుట్టిన రోజున 'గుడికెళ్ళి దండం పెట్టుకో' అన్న ఆదేశాలు, దాచిపెట్టిన బట్టలే కొత్తవని వేసుకున్న సంబరాలు! చేతిలో పావలాకాసుతో ఎన్ని ఆలోచనలు?.. కాలం మారింది...కాలంతో పాటూ నేనూ జ్ఞాపకాల దొంతరను అణచి పెట్టి , నలుపూ తెలుపూ జ్ఞాపకాలను పక్కనపెట్టి! పంచరంగుల చిత్రాలను ముందరపెట్టి, భవిష్యత్తును బహుదానందంగా చూస్తూ .... కాలం పరిగెడుతూనే వుంది.... - -------------------_ మనసు చిత్రమైనది.... జ్ఞాపకాల చిట్టా తీస్తూనే వుంది .... 60 ఏళ్ళుముందటి పుటల్ని వెదికి పట్టు కుంటూనే వుంది.... పది మంది పిల్లల లో ఒకరిగా పొద్దున్న లేచి స్నానాల గదికి క్యూలు, జడలు దువ్వించు కోవడాలు... సామూహిక టిఫన్లు, బడులకు పరుగులు... సాయంకాలాలు తోక్కుడు బిళ్ళలు, గోళీకాయలు, కాస్సేపు చదువులు, అమ్మ చేతి కలిపి కడులు, బామ్మ చేత తోకచుక్కల కథలు...వాహ్ !! కాల క్రమాన సోంత పిల్లలు... జడలు వేసే టైము లేక హెర్ కట్ లు, లెక్కలు చెప్పించలేక ట్యూషన్లు, ఇంకా పైన ఎంసెట్ కోచింగులు.. ఇంజనీరింగు చదువుల కోసం పాట్లు... చదువు లయ్యాక అమెరికాకు ఎగిరిన రెక్కలు.. గలగలలా సందడికి ఆనకట్ట నిశ్శబ్దం ఆవరించిన ఎన్నొదినాలూ... ఫోన్ల కోసం ఎదురు చూపులు! కాలం పరుగులు తీస్తూనేవుంది ... పెరిగింది టెక్నాలజీ...కంప్యూటర్లు..లాప్ టాప్లూ ఐ పాడ్ లూ , సోషియల్ నెట్ వర్క్లూ.. వేబ్ కెమరాలు పోయి ఫేస్ టైములూ.. నేరుగా చూడగలిగే అవకాశాలూ , మనమల బర్త్ డే లకు వేరువేరు లోకేషన్లు , పూల్ పార్టీలు, స్పా పార్టీలు, బౌన్సింగ్ ప్లేసులూ, విడియో గేములూ , ఎక్స్ బాక్సులూ, కోరినన్ని బట్టలూ,కోరికలకు మించిన వసతులు, హటాత్తుగా జ్ఞాపకాల పేజీలలో వెనక్కి పరుగులు... అమ్మ చిరునవ్వుల జ్ఞాపకాలు... పుట్టిన రోజున 'గుడికెళ్ళి దండం పెట్టుకో' అన్న ఆదేశాలు, దాచిపెట్టిన బట్టలే కొత్తవని వేసుకున్న సంబరాలు! చేతిలో పావలాకాసుతో ఎన్ని ఆలోచనలు?.. కాలం మారింది...కాలంతో పాటూ నేనూ జ్ఞాపకాల దొంతరను అణచి పెట్టి , నలుపూ తెలుపూ జ్ఞాపకాలను పక్కనపెట్టి! పంచరంగుల చిత్రాలను ముందరపెట్టి, భవిష్యత్తును బహుదానందంగా చూస్తూ .... కాలం పరిగెడుతూనే వుంది....

మిమ్మల్ని చదివించే ఒక 'సమీక్ష'
 ఒక కథల పుస్తకం వేసుకుంటే ఇంత  బాగా వుంటుందని తెలియలేదు. లేటు  వయసులో నయినా ఈ కిక్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఈ మధ్య వచ్చిన "నా వాళ్ళు" అన్న నా పుస్తకం పై ఈ సమీక్ష మిమ్మల్ని చదివిస్తు౦దని ఆశిస్తూ ...బాగున్న కథలతో...నా వాళ్ళు...
---------------------------------------------
అప్పుడప్పుడూ కొన్ని సార్లు మనకెదురైన సంఘటనలు, సందర్భాలూ ఎంతో కొంత కదిలిస్తాయ్ కొన్ని రోజుల పాటు వెంటాడ్తాయ్...ప్రతి ఒక్కరికీ అనుభవమే...కానీ కొందరు మాత్రమే అలా కదిలించిన సంఘటనలు తారసపడ్డ అనుభవాల్లోంచీ తివృత్తాలను తీసుకుని చక్కటి కథలుగా చెప్పేస్తారు. అందునా రచయిత్రులు ఇలా కథలుగా మరచడంలో నిష్ణాతులు కదా....అలా తానెరిగిన సమాజంలోంచీ, తన చుట్టూ వున్న మనుష్యుల జీవితాల్లోంచీ వస్తువు తీసుకుని కథలు వ్రాసిన డాక్టర్ కె వి లక్ష్మీ రాఘవ గారు వెలువరించిన నా వాళ్ళు- అనే కథల సంపుటిలో నాణ్యమైన ఓ 20 కథలున్నాయి. కొన్ని మెప్పిస్తాయ్..మరి కొన్ని ఒప్పిస్తాయ్. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ కథకురాలైన లక్ష్మీ రాఘవ గారు సాహితీ సృజనతో పాటు చిత్రలేఖనం, బొమ్మల తయారీలో కూడా నిష్ణాతులే కావడం అభినందనీయం. బోధనా రంగంలో వుండే వారికి సహజంగా లభించే వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మనస్తత్వాలను అధ్యయనం చేయడం ద్వారా కొన్ని కథలకు ఇతివృత్తాలను తయారు చేసుకున్నట్లుంది.ఇందులో.. నా వాళ్ళు- అనే శీర్షిక గల కథ ఓ అమ్మ తపనకు అద్దం పడ్తూ..అనాధ శిశువును అక్కున చేర్చుకుని మంచి జీవితాన్ని ఇచ్చేందుకు రమ్య పాత్ర పడ్డ క్షోభ- కథ సుఖాంతం చేసిన తీరూ బాగుంది. ఈ సంపుటిలో ప్రధానంగా గీత, ఐ హేట్ మమ్మీ అనే కథల గురించి చెప్పుకోవాల్సిందే. పిల్లల పెంపకంలో తల్లులు విస్మరించే అంశాలూ- తద్వారా ఆడపిల్లలెదుర్కొనే మానసిక సంఘర్షణా చక్కగా వ్యక్తీకరించారు. ముఖ్యంగా పరిష్కారాలతో కథలను ముగించడం హర్షణీయం. కేవలం సంఘటనలను ఓ మాలగా గుచ్చేసి పాఠకుల ముందు పెట్టేయడం కాకుండా కొన్ని సమస్యలకు సాధ్యమైనంత వరకు నేలవిడిచి సాము చేయకుండా పరిష్కారాలు సూచిస్తూ మెప్పించారు.తండ్రి ప్రేమ వుంటే తాను దేన్నయినా సాధించగలననుకునే గీత పాత్రతల్లి నిరాదరణ కారణంగా నలిగిపోవడం, చివరకు ఆత్మస్థైర్యంతో లక్ష్యం వైపు అడుగులు వేయడం రచయిత్రిగా చక్కగా తీర్చిదిద్దారు.అలాగే ఐ హేట్ మమ్మీ అనే కథ-పిల్లల పెంపకానికి ఓ గైడ్ పాఠంలా వుంది. టీవీల్లో వస్తున్న ఆట-పాట షోలమీద గతంలో చాలా కథలు వచ్చాయి కదా..అదే తరహాలో ఆలోచించండి అనే శీర్షికతో లక్ష్మీ రాఘవ గారు వ్రాసిన కథ కూడా ఆలోచించాలనిపించింది.మధ్య తరగతి జీవితాలను ప్రభావితం చేసే అంశాలనే ఎంచుకుని మొత్తం 27 కథలతో ఈ సంపుటి తెచ్చారు. ఇందులో గురివింద అనే కథ కూడా పిల్లల పెంపకానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిందే కాగా ...తిరుమల కొండకు వెళ్ళే వారి అగచాట్లను బ్రేక్ దర్శనం అనే కథలో దృశ్యమానం చేసారు. అమ్మంటే ఏమిటో తెలియచేస్తూ భద్రమ్మ కొడుకు అనే కథను హృద్యంగా మలిచారు.మిగిలిన కథలు కూడా చదివించేవిగానే పాఠకులను ఆకట్టుకుంటాయ్. పుస్తకం చేతిలోకి తీసుకున్న తర్వాత అలా ఆటోమేటిగ్గా అన్నీ చదివేస్తాం. చివరగా...నాకు నచ్చిన కథ మాత్రం- దేవుడూ దెయ్యమూ- అనే కథ....చాలా బాగా వ్రాసారు. ప్రమాణాల పరంగా భేషుగ్గా వుంది. తెలుగు రచయితలు అలాంటి కథల జోలికి సాధారణంగా వెళ్ళరు కానీ....లక్ష్మీ రాఘవ గారు ఇంకా అలాంటి కథలు వ్రాస్తే పాఠకులను మెప్పించవచ్చు. 

అమ్మా, నీ చావూ ఒక ఆదర్శమే! ,

 అమ్మా, నీ చావూ ఒక ఆదర్శమే!


తొమ్మిది మంది సంతానానికి కారణమై,
తొంబై ఏళ్ళ వయసులో మూడు సామాన్లతో
పిల్లలందరి ఇళ్ళూ పిల్లిలా తిరుగుతూ,
తన జబ్బులు వెలికి రాకుండా,
ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా,
తనపని తానూ చేసుకుంటూ,
 మెట్టిన ఇల్లు చేరాలన్న చివరి కోరికతో అక్కడ చేరి,
హటాత్తుగా ఒక రోజు కింద పడి కాలు విరిగి,
రెండో రోజు ఆపరేషనై,
మూడో రోజు ‘పడకమీద జీవితమా’ అని నిరసిస్తూ,
ముక్కులో ట్యూబులు పీకేసి,
వూపిరి భారమై జీవితానికి స్వస్తి చెప్పిన
అమ్మా ! నీ చావూ ఒక ఆదర్శమే!

జూలై 4th 2014 న మమ్మల్ని వీడి వెళ్ళిన మా అమ్మ గారు స్వర్నమ్మ ను తలుచుకుంటూ .....


 అమ్మణ్ణి [లక్ష్మి రాఘవ]                                            ,

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template