కదంబమాలిక-8

కదంబమాలిక-8

చిన్నప్పుడు పెద్దమ్మ దగ్గరికి మద్రాసు వెడితే మార్కెట్టు లో సైకిలు మీద బుట్టలు పెట్టుకుని అత్యంత సువాసన వచ్చే కదంబం మాలలు అమ్మేవారు. “కదంబం” అన్న పదానికి అర్థం –వివిదరకాలపూలను కలిపి కట్టడం అని పెద్దమ్మ చెప్పింది . అలా అప్పుడు నా చిన్ని బుర్రలో entry తీసుకుంది కదంబమాల !!!

ఇటివల ఒక్కసారిగా ప్రమదావనంలో సువాసనలు గుప్పున వస్తూటే వాటిని ఘాడంగా పిల్చేసి మనసు డోలలాడుతూ పరవశం లో వున్నా నన్ను కదంబమాల లో మీ పూల పరిమళం చేరుస్తా రా ? అని అడిగితె వుక్కిరిబిక్కిరి అయ్యాను ..ఎందుకంటే ...రచయిత్రులు కామంటూనే అందంగా అల్లెస్తున్న ప్రమదావన కుసుమాల మద్య అందంగా ఇమడ గలనా అని సందేహం !! కదంబమాల లో నాపువ్వు ని ఆగ్రాణి౦చి చెబుతారు కదా...

ముందు వారం ఏమిజరిగిందో గుర్తుకుతెచ్చుకుందాం ...3psmlakshmi.blogspot.com లో కదంబమాల -7 లో

---- ----- ------- ------ ------ ------- ------- ------ ---------

జానకిని చూడటానికి శ్రీరాం ,సరోజినీ , అనిత , సుభద్ర వెళ్లారు . సుభద్ర ని వద్దన్నారు కాని “నేను జానకిని చూడాలి “ అని వచ్చింది .

జానకికి ఎక్కువ దెబ్బలు తగల్లేదు. కాని మానసికంగా బలహీనంగా వుంది వీళ్ళందరినీ చూడగానే బోరున ఏద్చేసింది .సుభద్ర వెళ్ళి జానకి చెయ్యి పట్టుకుంది . అనిత సరోజినీ మంచం మీద కూర్చుని” రేపే వెళ్ళిపోదాం జానకీ.పరవాలేదు “అని అనునయించారు . శ్రీరామ్ డాక్టర్ గారితో మాట్లాడి వచ్చాడు . బిల్ పేమెంట్ పూర్తిగా తన బాధ్యత అని చెప్పి వచ్చాడు. లక్షుమ్మ ,ఆమె భర్తను ధ్యేర్యంగా వుండమని , కొద్ది రోజులు జానకిని అంటిపెట్టుకుని వుండాలని చెప్పారు. మరుసటి రోజు తను వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి వెడ తానని చెప్పాడు ....

ఇంటికి వచ్చాక అనిత ఎక్కువ మాట్లాడలేదు. లక్షుమ్మ అన్న మాటలు ఆమె చెవిలో ఇంకా వినపడుతూనే వున్నాయి.”కాలేజిలో ఇతర పిల్లలకు,టీచర్లకు చెబితే అనితమ్మ మీద అల్లరి మానేస్తారుకద “ అంది ఏంతో ఆవేదనతో

“చదువుకునే పిల్లల మీద అలాటి భాద్యతలు పెట్టకూడదని అలా చేస్తే అనిత విషయం నలుగురి నోళ్ళలో పడుతుదని “అన్నశ్రీరామ్ మాటలు గుర్తుకు వచ్చాయి .

మధ్యతరగతి కుటు౦బాలలో ఎప్పుడూ ఇలాటి మాటలే వినిపిస్తాయి .దిగువతరగతి వాళ్ళు తిరగబడతారు .పై తరగతి వాళ్ళు ఎటువంటి పరిస్తితిని డబ్బు సహాయం తో సరి చేసుకుంటారు ..మధ్య తరగతివాళ్ళు తలవంచుకు పోవాల్సిన్దేనా?? అనిత ఆలోచనలు సాగిపోతూనే వున్నాయి.

మరురోజు లాలేజిలో ప్రేరణ ని కలిసింది “తన మనసులోని మాటలన్నీ ప్రేరణ ముందు వుంచింది. అనిత లో వచ్చిన మార్పుకు ప్రేరణ ఆశ్చర్యపోయింది. ఆరోజే కాలేజి లో వున్నా కరాటే క్లాసులకు చేరడానికి ఏమి చెయ్యాలో కనుక్కుని ఇంటికి వెళ్ళింది.

“నేను కరాటే క్లాసులకు చేరతాను పెదనాన్నా “ అని శ్రీరామ్ తో చెప్పింది.

“మొదట చదువు సంగతి చూడా లమ్మ. బాగా చదువుకోవాలి ఆపైనే”

“చదువులో ఏమాత్రం తగ్గను పెద్దనాన్న . నా ఆత్మరక్షణ కొసం కరాటే నేర్చుకుంటే బాగుంటుందనుకుంటున్నాను ..ప్రతిసారి నాకు తోడుగా ఎవరైనా వస్తారా అని ఎదురుచూడటం కన్నా ఇలాటివి నేర్చుకుని దైర్యం గా వుండటం మేలుకదా “

శ్రీరాం మౌనం అంగీకారం అయింది.

ఆరోజు కరాటే క్లాసు తరువాత తన ఫ్రెండ్ శశి తో పాటు ఇంటికి వస్తోంది అనిత. సర్రున ఆగింది టూ వీలర్ అనిత పక్కన ..అంతదగ్గరగా ఆగేటప్పటికి అనితకు భయ౦ వేసి కాస్త పక్కకు తప్పుకో బోయింది . ఇంతలో చెయ్యి పట్టుకున్నాడు ఉత్తేజ్ టూ వీలేర్ మీద కూర్చునే ..

“ఏయ్ అనిత , ఏమిటి ఈమధ్య కాలేజి నుండి తిన్నగా రావటం లేదా ? అంట ఆలస్యం అయింది అయింది ఎందుకటా? ఏమికత?”

“ఏయ్ , చెయ్యి వదులు “ గట్టిగా అరిచింది అనిత .

శశి బిత్తర పోయి పక్కకు వొదిగి నిల్చుంది

“ఏమిటే ..అంత గొంతుఎత్తుతున్నావు? పొగరెక్కిందా?”

ఉత్తేజ్ గొంతు పెంచాడు.

ఒక్కసారిగా అనిత స్ప్రింగు లాగాతిరిగి అతను పట్టుకున్న చెయ్యి నేర్పుగా మెలితిప్పి వంచి అతని వీపుమీద ఒక్కతన్ను తన్నింది . అనిత అంత ఫాస్టుగా అలా కొడుతుందని వూహించని ఉత్తేజ్ కిందపడ్డాడు. కాని మెరుపులా లేచాడు వెంటనే వెహికల్ పౌచ్ లో ఉన్న ఆసిడ్ బాటల్ ని మెరుపులా తీసాడు .మూత తీయడానికి ప్రయత్నిస్తుండగా అనిత మల్లి అతని చేతిమీద కొట్టింది కాలుతో. ఆ ఫోర్సుకి బాటల్ మూత ఎగిరిపడి ఆసిడ్ ఉత్తేజ్ ఛాతిమీద పడింది.

“అమ్మ....అమ్మా ....మంట..” ఆసిడ్ పడ్డ ప్రదేశం కాలిపోతుంటే కింద పడి కొట్టుకోసాగాడు .

అనిత వెంటనే శశి చెయ్యి పట్టుకుని లాగి ‘పద” అంది.

ఉత్తేజ్ చుట్టూ జనం మూగారు ..

“నాకు భయంగా వుందే అనితా”

“భయం ఎందుకే? మనం ఏమి తప్పుచేయ్యలేదే...చెడును ఎదిరించాం అంతే ..చెడును ఎదిరిస్తే తప్ప మంచి పెరగదు ..శశి ..ఇందుకే నేను కరాటే నేర్చుకుంది “అనిత వాయిస్ లో ధైర్యానికి శశి ఆశ్చర్య పడింది .ఇన్ని రోజులు చుసిన అనిత వేరు ఇప్పుడు చూస్తున్న అనిత వేరు అనిపించింది శశికి .

ఇల్లు చేరాక శ్రీరామ్ తో “ మీతో మాట్లాడాలి పెదనాన్నా “అంది అనిత అక్కడే వున్నా నారాయణమ్మ, సరోజినీ కొంత ప్రస్నార్తకంగా చూసారు ..

“ఏమిటమ్మ అనితా” అన్నాడు శ్రీరాం .

నెమ్మదిగా జరిగింది అంతా చెప్పింది అనిత.

“ఇప్పుడు చెప్పండి పెదనాన్నా నేను కరాటే నేర్చుకుంది మంచిదయిందా...లేదా “

అప్పుడు తేరుకున్నారు నారాయణమ్మ , సరోజినీ....

“అనితా....” అంటూ ఒక్కసారి అక్కున చేర్చుకుంది నారాయణమ్మ .

“నాలో ఇంత ధైర్యం రావడానికి కారణం నీవుకూడా పెద్దమ్మా..ఏంతో నిష్టతో సంకల్పం చేసి పూజ చేసె నిన్ను చూసి ,నేనుకూడా భగవంతునిమీద నమ్మకంతో ,ధృడమైన సంకల్పం తో ధైర్యం గ ఎదురుతిరగ గ లిగాను ..

అనిత ఆత్మవిశ్వాసానికి అబ్బురపడి సరోజినీ ఆప్యాయంగా అనిత తలనిమిరింది ..

అప్పుడు అన్నాడు శ్రీరాం

"నిన్ను చదువు కోసమని ఇక్కడకు పిలుచుకు వచ్చాను కాని ఇంత తొందరగా నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఒక ఆత్మ స్థయిర్యం కల మనిషిగా ఎదుగుతావని వుహించలేక పోయాను ..చుట్టూ ఇలాటివారు తయారైతే ఎంతమందో “జానకి”లను రక్షిపవచ్చు ..తనను తానూ ఎలా రక్షించు కోవడం ఎలానో నేర్పవచ్చు ..అయిన మనం పోలిస్ స్టేషన్ కు వెళ్ళి నీమీద దాడి జరిగినట్టు..ఆత్మ రక్షణ కై నీవు ఎదురు తిరిగినట్టు స్టేట్మెంటు ఇచ్చి వద్దాము పద “

తనను ఇంతగా సప్పోర్టు చేస్తున్న పెదనాన్న ఫామిలీ కి చెయ్యెత్తి దండం పెట్టింది మనసులో.

“అనిత చదువుకుని ఐ.ఏ. స్ అవుతానని అన్నావు .ఇప్పుడేమో రూటు మార్చావు. Future లో ఏమి చేయ్యదలుచుకున్నావు? అడిగింది సరోజినీ

అనిత సమాదానం ఎలావుంటుందో తరువాతి బాగం లో................

కదంబమాల-9 శ్రీలలిత గారి బ్లాగులో చదవండి http://srilalitaa.blogspot.com/2011/01/9.html

.....

9 comments:

మాలా కుమార్ said...

బాగా రాశారండి .

చెప్పాలంటే...... said...

చాలా చక్కగా బాగా రాసారు...అందరూ ఎంతో బాగా కదంబ మాలని గుచ్చుకొస్తున్నారు

psmlakshmiblogspotcom said...

చాలా బాగా అందిపుచ్చుకుని చక్కగా రాశారు.
psmlakshmi

శ్రీలలిత said...

ప్రస్తుతం అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలో బాగా చెప్పారు...

Lakshmi Raghava said...

మాలా గారూ,చెప్పాలంటే గారూ ,లక్ష్మీ గారూ
థాంక్స్ అండి

Lakshmi Raghava said...

శ్రీ లలితగారు
మీరిలా అవకాసం ఇస్తే అందరు ప్రమదలు మంచి మంచి ఇడి యాలతో తిరగ రాసేస్తారు..మరో ప్రయోగం మొదలుపెట్టండి.
thank you
lakshmiraghava

Durga said...

లక్ష్మి రాఘవ గారు,
చాలా బాగా రాసారు. అనిత పాత్ర బాగా రూపు దిద్దుకుంటున్నది. 8 బాగాల్లో ఎన్నో పాత్రలు, అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టమే కదా! అనిత ప్రణతి దగ్గరికి వెళ్ళింది అని రాసారు కాని ఆ అమ్మాయి పేరు ప్రేరణ అందరికీ ప్రేరణ్నిస్తూ వుంటుంది అని ఆ పేరు పెట్టాను ఆ పాత్రకి. పేరులో ఏముంది లెండి, అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో, దేన్ని అయినా ఎదుర్కోవడానికి వెనుకంజ వేయకూడదని, వేయటంలేదని చక్కగా రాసారు.

Lakshmi Raghava said...

అరె...అన్ని పేర్లు గుర్తు పెట్టుకున్నననే అనుకున్నా..పొరబాటుకు ..క్షమించండి
లక్ష్మీ రాఘవ

Telugu Cartoon said...

లక్ష్మి రాఘవ గారు,
నమస్కారములు. మా ఇంటిల్లిపాదికకు మీరు రాసినది నచ్చింది.
మీరు రాస్తూనే వుండాలి. దయచేసి ఆపకండి.
నాలుగు తెలుగు పదాలు చదవడానికి, సమాజం కోసం తెలుసుకోవడానికి
మీ లాంటి అనుభవజ్ఞుల అనుభవం తప్పకుండ దోహదం చేస్తుందని అనడములో
సందేహం లేదు.

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template