ఎంతకాలం ఈ నిరీక్షణం ?


                    ఎంతకాలం  ఈ  నిరీక్షణం ?
మంచి నీటికి రేషన్ .
విద్యుత్ కోత చెప్పలేనంత .
కూరగాయల ధరలు ఆకాశంలో
బియ్యం , పప్పుల ధరల మంటల్లో
కాలిపోతున్న సామాన్యుడా
ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం ఏమిచ్చింది నీకు ?

పెరుగుతున్న పెట్రోలు ధరలు!
ధిక్కారం చూపుతున్న ప్రకృతి వైపరీత్యాలు ,
బెంబే లేత్తించే బాంబుల దాడులు ,
ప్రేమోన్మాదుల ఆసిడ్ అటాకులు,
తవ్వినకొద్దీ బయటపడుతున్న
అక్రమార్కుల అవినీతి గనులు !
నడుము విరుస్తున్న రాజకీయ రాజీనామాలు ,
మళ్ళి , మళ్ళి వస్తున్న ఎలక్షన్లు ,
ఎక్కడికీ పయనం ? ఎటుపోతున్నాం మనం?
పించన్లు , ఫీజులు రెండు రూపాయల బియ్యా లు
ఎన్ని పథకాలు వచ్చినా
కనపడదేమి ప్రోగ్రేస్సు ???

ఓటుకు నోటు కాకుండా
మానవత్వాన్ని గెలిపించి నప్పుడే
మరో గాంధీ పుట్టగలడు
అవినీతి ఆంధీ ఆగగలదు
ఎప్పుడూ వచ్చు ఆ దిన౦ ?
ఎంత కాలం ఈ నిరీక్షణం ?4 comments:

జ్ఞాన ప్రసూన said...

nijame nadee batuku bhayamgaa tayaarayindi

Lakshmi Raghava said...

జ్ఞానప్రసూన గారూ ,
ధన్యవాదాలు ...ఇంకా ఎంతో వేదన వుంది ...చెప్పాలనీ వుంది

శ్రీలలిత said...


మానవత్వం మరిచిన మానవుల మయిపోయాం..
స్వార్ధం తన కొసమే కాకుండా తన తర్వాత మరో నాలుగు తరాల వరకూ ఇప్పటి నుంచే జాగ్రత్త పడమంటోంది..
ఇటువంటి సమాజం మారాలంటే ఎన్ని తరాలు నిరీక్షించాలో...

Lakshmi Raghava said...

మార్పు ఎందుకు రావటం లేదు అన్నది ఆలోచించాలి అందరూ,,ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి..ఎప్పుడూ అన్నదే ప్రశ్న !
ధన్యవాదాలు శ్రీలలితా

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template