ఆదికేశవులు ఇంట్లో చోరి - మరి మేమో ?

రత్నాలు పొదిగిన నేక్లేసులు, వజ్రాల గడియారాలు ,
ఎన్నో వెండి సామాన్లు చోరి అయితే ఆదికేశవుల కుటుంబానికి తెలియనే లేదు .
.రివాల్వర్ పోయే వరకు పోలీసులవరకు పోనేలేదట !!!!
మరి మాయింట్లో ఎర్రగావుందే గ్యాసు సిలిండరు,
తెల్లగా వెలిగే  బల్బు ,
కొళాయిలలో నీరు,
కనిపించక చాలా కాలం అయ్యింది ..
కంప్లైంటు తీసుకుంటారా పోలీసులూ..
చాల ఆలీసం చెయ్యద్దు అస్సలు మేమే కనిపించక పోవచ్చు త్వరలో ..
సామాన్యులం గుర్తు పెట్టుకుంటారు కదూ !!!

7 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

సామాన్యుల గోడు వారికి పట్టేనా!?

ఇలా చురకలు వేయాల్సిందే!!

బావుంది..లక్ష్మి రాఘవ గారు.

Anonymous said...

బామ్మ గారు,

నిజాలు ఇట్లా మరీ ఓపెన్ గా రాయకూడ దేమో సుమండీ!

చూద్దాం, మీ కోరిక పై దారి పోయిన కుళాయి దొరుకు తుందేమో మరి ! ఆ పాటి అయినా వాళ్ళు చేయక పోతే ఎలాగా మరి !

చీర్స్
జిలేబి.

Lakshmi Raghava said...

ఎవరో ఒకరు చెబితే మేలు కదా జిలేబి గారు ,
సామాన్యులకే కస్టాలు మరి ..
ధన్యవాదాలు వనజవనమాలి గారు & జిలేబిగారు
లక్ష్మి రాఘవ

శ్రీలలిత said...


మనం కనిపించకపోయినా పట్టించుకునే నాథులు ఎవరండీ?
పెద్దవాళ్ళింట్లో కుక్కపిల్లకి జలుబు చేస్తే విదేశాలనుంచి స్పెషలిస్టులు వస్తారు...

Lakshmi Raghava said...

మీరన్నది నిజం శ్రీలలిత.ధన్యవాదాలు

Unknown said...

namasthe,
naa peru vinodini.naaku blogs vrayalani undandi.kani yela vrayalo theli yadamu ledu mee blog lo vrasthara yela vrayaloooooooooo
please..................





Lakshmi Raghava said...

vinoda,
kotta blog kosam "how to start a new blog " anna daanlo chudandi, ledaa E- blogger ani search cheste elacheyyalo chebutaaru

lakshmi raghava

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template