ద్వారకా స్మృతి....

              ద్వారకా స్మృతి....
ఒక   క్రమశిక్షణ
       విజ్ఞానం
       ధైర్యం 
       ధీరత్వం
       నిరాడంబరత
       నిస్వార్థం
       నిరంతర ప్రయోగి,
ఎన్ని కోణాలు నిక్షిప్తం ఈ మనిషిలో???
సామాన్యుని ఆలోచనల్లో మార్పు రావాలని,
సమాజంలో ఎన్నో మార్పులు కావాలని,
అందరూ ఒక్కసారైనా ఆలోచించాలని,
సామాజిక సృహ  అందరిలో కలిగించాలని,
అది నిధిలా నిక్షిప్తం అవాలని..
కాలమనే పరుగు పందెంలో,
జనజీవనంలో, సమాజంలో,యువత ఆశయాలలో,
సుడిగాలిలా మార్పు వస్తుందని
ఆశించిన  ఆ ఆశల రాగాన్ని
స్మృతి లోనే శ్రుతి చేసుకోవాల్సి వస్తోంది...

పరలోకానికి ‘వీసా’ వచ్చిందని నిశ్శబ్దంగా నిష్క్రమిస్తే
జ్ఞాపకాల దొంతరలు తడబడి
నగిషీ ఎరుగని చిరునవ్వుని గుర్తుచేసుకుని,
మాటలు మౌనం దాల్చితే
కలం గజ్జె కట్టి  నాట్యం చేస్తూ
అక్షరాలను మాలలుగా చేసి
మనసులోని ఆవేదనకు ఆకృతి నిచ్చి
రచనగా నిలిచింది పంచుకునేందుకు .........
    

 ch.వెంకట రత్నం  అన్న రచయిత ,  ద్వారకా' పేరుతొ ఎన్నో రచనలు అనువాదాలు చేసిన వారు 84  ఏళ్ల వయసులో  జనవరి లో గుండె పోటు తో మరణించారు..ఆయన స్మృతిలో ఈ చిన్ని రచన ..
లక్ష్మి రాఘవ 

2 comments:

Meraj Fathima said...

చక్కటి శైలి,భావమూ ఉన్నాయి. మేడం.

Lakshmi Raghava said...

మిరాజ్
మీకంటే బాగా రాయలేనేమో కాని మనసులోకి ఒక బాధ, ఒక స్ట్రాంగ్ ఆలోచన వచ్చినప్పుడు కొంచం రాయాలనిపిస్తుంది. ద్వారకా గారు రచయితగా నాకు పునర్జన్మ ఇచ్చారు. చాలా ఎంకరేజ్ చేసారు. గోప్పరచయిత అయిన ఆయనను సాహితీప్రపంచం గుర్తించలేదు! అదీ నా బాధ.

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template