streela sammeaస్త్రీల

స్త్రీల సమ్మె

స్త్రీలంతా సమ్మె చేయాలని వున్నారు!

యెందుకనీ?

కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే

బ్రూణ హత్యలు చేయిస్తున్నారని!

తప్పించుకుని గర్భం నుండి బయటపడితే

కన్నతండ్రే చెత్తకుప్ప పాలుచేస్తాడని !

పదేళ్ళ వయసొస్త్తే గొడ్డులా చాకిరీ చేయిస్తూ

జీతానికి బలిపశువుని చేస్తారని !

ఆపై వయసు వచ్చి అందంగా తయారైతే

అత్యాచారానికి ఎదురుచూస్తారని!

ప్రేమంటూ వెంటపడితే కాదన్నందుకు

పొంచివుండి ఆసిడ్ దాడులకు ఆహుతి చెస్తారని!!

కట్నాలవేలంపాట్లో గెలుపొంది భార్యైతే

మరింత ధనాశ తో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తారని!

ముసలి వయసు వస్తే కన్నపిల్లలే

ముసలిదాని చకిరీ మాకొద్దు అంటూ

ఈడ్చి బజారుపాలు చేస్తారని!!

ఎందుకు బతకాలి?

ఎవరికొసం బతకాలి?

అత్యాచారాలు చేయంచుకోవాలనా?

అడుగడుగునా దోపిడీ కి గురికావలనా?

అందుకే వద్దు మాకు జీవితం !

రాజీనామాలు చేస్తాం !!

తల్లిగా, పిల్లగా, వనితగా భార్యగా, అమ్మమ్మ,నాయనమ్మలుగా !!

సహరించము సంపర్కానికి!!

బతకండీపురుషులూ స్త్రీలు లేని సమాజంలో!

మా సమ్మే కొనసాగుతుంది!!

రచన

లక్ష్మీ రాఘవ,

2 comments:

geetika said...

లక్ష్మీ రాఘవ గారూ,
sorry for the late reply andi.
స్త్రీ జాతి పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకూ పడే బాధల్ని చాలా బాగా చెప్పారు. నిజంగా స్త్రీ జాతి సమ్మె చేస్తే అప్పటికి గానీ ఆడవాళ్ళ విలువ తెలీదేమో ఈ సమాజానికి. మీరు ఇంకా కొత్త కొత్త పోస్ట్ లు వ్రాస్తూ ఉండండి.
60 ఏళ్ళ వృద్ధురాలిని, నా బ్లాగ్ ఎవరు చూస్తారు అన్నారు. విజయానికి మొదటి మెట్టు ప్రయత్నమే కదండీ. మీ అనుభవం మా లాంటి వారికి, ఇంకా సమాజానికి ఎంతో అవసరం. తప్పక రాస్తూ ఉండండి.
అలాగే పబ్లిష్ అయినవి ఏమయినా ఉంటే స్కాన్ చేసి బ్లాగ్లో పెట్టండి.
బ్లాగ్ ప్రొఫైల్ లో మీ ఈమెయిల్ అడ్రస్ పెట్టండి.
అలాగే కామెంట్స్ కి వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి.

గీతిక బి

శరత్ 'కాలమ్' said...

మీ బ్లాగు తెలుగు బ్లాగు అగ్రిగేటర్లలో వస్తున్నట్లు లేదు. వాటిల్ల్ వస్తేనే ఎక్కువమంది చూస్తారు. మాలిక http://maalika.org/ లాంటి బ్లాగు సంకలినులు వున్నాయి. వారిని మీ బ్లాగు జతచేయమని సంప్రదించండి.

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template