కథాజగత్ కథ కు విశ్లేషణ

స్వయంవరం-రచన ..అల్లురిగౌరిలక్ష్మి
స్వయంవరం....అల్లురి గౌరి లక్ష్మి గారి కథ అందరికి ఒక మామూలు కథ లాగ అనిపిస్తుంది..కాని ఆలొచిస్తే ఒక మంచి సందేశం కనిపిస్తుంది..అందుకే నాకు నచ్హింది.ఒక పెళ్ళి అయిన అమ్మాయి పక్కింటి కుర్రాడి తో లేచిపోతే పరువుపొయిందనుకునే పుట్టింటివారు , సమాజంలో అందరూ ఏమనుకుంటారో అని, అందరూ తమకుటుంబాన్ని వేలెత్తి చుపుతారనే భయం !!అంతేకాదు అలా లేచిపోఇందనగానే తద్దినాలు పెట్టి చచ్చిపొయిందని చెప్పే తల్లిదండ్రులు, భర్త యెంత కష్టం పెట్టీనా భర్త్త దగ్గిరే నే నీ బతుకూని బొధించేవారు, భర్త తక్కువ చదువుకున్నా , అంతస్థులో తక్కువ అయినా సర్దుకు పోవాలమ్మా అని చెప్పే పుట్టింటివాళ్ళు చాలామందే వున్నారు ..ఎంతసేపూ పరువు ప్రతిష్టా అని ఆలొచిస్త్తారే తప్ప..అమ్మాయి అత్తగారింట్లో యెంత సుఖపడుతోంది అని తెలుసుకోరు...పెళ్ళిచేయగానే బాధ్యత తీరిపోదు. అమ్మాయి ఇంట్లోంచి పారిపోవాల్సిన పరిస్తితి యెందుకువచ్చిందో తెలుసుకొవడానికి ప్రయత్నిచరు ..చివరకు అమ్మాయి నిర్ణయం నచ్చక బరితెగించిందనే అనుకుంటారు తప్ప .....యెలావుందో అలోచించరు..ఈ కథలొ రేణుతో వదిన కామేశ్వరి " వ్యక్తికి, వ్యవస్థకూ ఘర్షణ ఏర్పడినప్పుదు వ్యక్తిధర్మాన్నే ఉత్క్రుష్టమైనదిగ అంగీకరించాలి. ఎన్ని నీతి భొధలు విన్నా మనిషి తన సుఖం తరువాతే సమాజం గురించి ఆలోచిస్త్తాడు. అది మానవనైజం , కాదనలేని నిజం " అన్న మాటలు ఈ కథకు హైలైటు.రేణు జీవితములొ వివేక్ వంతి సంస్కరవంతుడు తారసపడటం తన అద్రుష్టం. . .. .
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/svayanvaram---alluri-gaurilaksmi

0 comments:

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template