ఇదేనా కోరుకుంది?

ఈజీవితం సుఖం గ గడపడం కొసమే అన్నట్టు జీవించాలని ప్రయత్నిస్తాము.పెళ్ళి ,పిల్లలు కొరుకున్నట్టు గానే జరిగితే ఇక ధ్యేయం అంతా పిల్లల ఆలనా, పాలనాల విషయాల తోనే!తరువాత పిల్లలు పెరిగేకొద్దీ వారి చదువులూ ..భవిష్యత్తూ ..దానికొసం పరుగు పందెం లా, అలసట లేకుండా శ్రమించడం!ఎంతసేపూ వాళ్ళు చదువుకుని ఎలా పైపైకి ఎదుగుతారనే తపన...తమగురించి అలోచనలే వుండవు ..ఎంతసేపూ వారిభవిష్యత్తు కొసం ధనార్జన...ఎలా పొదుపు చెయ్యాలి ?? వాళ్ళు ఏలైనులొ వెడితే బాగుంటుంది...ఇదే యోచన ఏ ఇంజినీరొ , డక్టరో అయితే వారు సెటీల్ అయ్యరనే తృప్తి ఆపై వారు పై చదువులకొసంవిదేశలకు వెడతామంటే అదొ ఆనందం! పిల్లలను సరైన దిశలొ పెట్టమన్న తృప్తి !! అల్ల పిల్లలందరు విదేశాలకు వెళ్ళిపొతే మనమూ ఒకసారివెళ్ళి విదేశాలకు వెళ్ళి వచ్చామన్న హోదా!కాని అది ఎన్నాళ్ళు ..........ఈ జీవితపు పరుగు పందెం లో అలిసి...రిటైరైనాక తమగురించి ఆలొచించుకునే టైము దొరికినప్పుడు ' పిల్లలతో సంతృప్తి అయిన జీవితం గడిపామా?' అని ఆలోచించుకునే తీరికవున్నప్పుడు పుడుతుంది ఒక చిన్న కొరిక...సంతృప్తిగా మనమలతో, మనవరాళ్ళతో ఆడుకుంటూ సంతొషంగా గడపాలని .........ఈ కొరిక బలీయమై విదేశాలకు వెళ్ళి ఆరు నెలలౌగడిపినా తిరిగి స్వదేశం బయలుదేరక తప్పదు....తిరిగి వచ్చాక జ్ఞాపకాల చిట్టా పెరుగుతూ మన్సులొ బాధను పెంచుతుంది.చిన్ని బోసినవ్వులు మిస్ చేస్తూ మరోసారి వాళ్ళను చూడాలన్న కొరిక చంపుకొలేక, ఆర్థికం , ఆరొగ్యం సహకరించక మనసు మూగగా రొధిస్తూవుంది.తీరికగా, తృప్తిగ జీవించాలి అన్న కొరిక ఎంతో దృడంగా అనిపించినప్పుడు ....ఇన్ని రొజుల పరుగులు గుర్తుకువచ్చి ఏమి అనుభవించాము ? పిల్లలను ఇంతగా చదివించి వారిని విదేశాలకు పంపించి ?? జీవితచివరి మజిలీలో కోరుకున్న, కలసివుండాలనే సుఖం ... మనుమల ముద్దు మురిపాలు... రాత్రి పూట చెప్పాలనుకునే చిట్టీపొట్టీ కథలు...తినిపించాలనుకునే గొరుముద్దలూ మిస్ అవటం లేదా ఇదే నా కొరుకున్నది? అనిపించక మానదు......అయినా జివితం సాగుతూనే వుంటుంది.....

6 comments:

శ్రీ said...

చాలా బాగా రాసారు.చిన్నప్పటి నుండి చదువులు చెప్పి, పెద్దవాడిని చేసిన అమ్మని ఆరు నెలలు ఉంచుకుని పంపిస్తే, ఆ అమ్మ పడే వ్యథని చాలా బాగా చెప్పారు.

Lakshmi Raghava said...

శ్రీ గారూ
స్వానుభవం కూడా..మీకు నచ్చినందుకు సంతోషం

Anonymous said...

నిజంగ చాలా బాగ రాసారండి... అమ్మ గురించి ఎమైన ఇంకా ఆలోచనలు ప్లీజ్ రాయండి.

Lakshmi Raghava said...

faruq mirza garu,
అమ్మ గ అనుభవాలు చాలా వున్నాయి .మీలా గ అడిగేవాల్లువుంటే ఎన్నో బయటకు వస్తాయి.రాయడానికి ప్రయత్నిస్తాను.thanks for the complement

meraj fathima said...

లక్షి గారూ, అమ్మగా మీరు పడిన ఆవేదన ఎలాంటిదో అర్ధం అవుతుంది. తల్లికి బిడ్డ ఎంత పెద్దవడైనీ అతని చిన్ననాటి జ్ఞాపకాలే తలపుకు వస్తాయి. "తాత ముంత తల వాకిట ఉన్నట్లు " వారు అనుబవించిన రోజు గుర్తుకొస్తాయి. ఇప్పటి దిక్కుమాలిన చదువులు నీటి కథలు లేక పిల్లలకి సంభంద బాందవ్యాలు తెలీదు. మీకు ఏదైనా వ్యాపకం కావాలి వేదన ఎంత ఉన్న కవితల రూపంలో పెట్టండి, మాతో పంచుకోండి, లోకంలో చాలా మంది బిడ్డలు ఉన్నారు అమ్మగా చూడండి

Lakshmi Raghava said...

meeraj
థాంక్స్. తప్పకరాస్తాను ఇంకా అమ్మగా నా అనుభవాలు .
లక్ష్మీ రాఘవ

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template