,
జీవితం మరణం కొసం చేసెప్రయాణం
మరణం జీవితం కోసం ఇచ్చే పాస్పోర్టు –కోల్దన్
ఎంత బాగా చెప్పారు అనిపిస్తుంది ...
కాని ఆత్మీయుల మరణాల లిస్టు పెరిగితే
దుఃఖం ఎంత లోతైనదో తెలుస్తుంది !
ఏబై ఏళ్ల తమ్ముడి మరణం తో
క్షోబించిన మనసును అనునయిస్తూ వుంటే
టక్కున నా పాస్పోర్టు రెడీ అంటూ బావ అనుసరించాడు..
అక్క ముత్తైదుతనం వెక్కిరించింది ....
ఏభైఏళ్లు కలసివున్న మనిషి హటాత్తుగా
ఎలా వెళ్ళిపోతాడు? అన్న అక్క ప్రశ్నకు
సమాదానం చెప్పలేక మౌనమే శరణ్యం!!
ఇంతలో అత్యన్త ప్రియమైన స్నేహితురాలు
నీవు అమెరికా వేడితే , నేను పరలోకానికే వెడతా
అంటూ “టా టా” చెప్పింది!
నలబై ఏళ్ళ మా స్నేహబంధం వెక్కిరించింది !
తను లేని ప్రపంచంలో జ్ఞాపకాల దొంతర
కదిలిస్తూ వుంటే......మేనకోడలు కేకపెట్టింది...
తనకడుపులోబిడ్డ బయటి ప్రపంచాన్ని చూసిన
గంటలోనే ‘నేపోతున్నానమ్మా’ అంటూ కన్నుమూసాడని!
కడుపుకోతను, కన్నదుఃఖాన్ని ఎవరు
సముదాయించి సమాధానం చెప్పగలరు?
తన నటనా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని,
అనురాగ వెల్లువతో అందరి ప్రేమను గెలుచుకుని,
ఆస్పత్రి పాలైన తల్లికి సేవచేస్తానంటూ వెళ్ళిన వియ్యంకుడు
టక్కున స్వర్గానికి నా అవుసరం వచ్చిందంటూ పయనమై వెళ్ళీ పోతే..
షాకు తిన్న మా మనసులుజీర్ణించు కోలెక, ఆక్రోసించాయి ...
ఇలా మరణాల లిస్టు పెరుగుతూ వుంటే
మనసు బాధతో రోదిస్తువుంటే
ఇంట్లో చిన్న అనారోగ్యం అయినా
వులిక్కి పడటం అలవాటవుతూ వుంది!
ఎందుకింత ఆరాటం జీవితం మీద !
ఎందుకింత ఆప్యాయత అయినవారి మీద?
జ్ఞాపకాలు శకలాలై గుచ్చుకుంటూనే వున్నాయి
పోయినవారి మరణం క్షణమై తే
మిగిలినవారి మరణం క్షణ క్షణమూ......
ఎన్ని రోజులు కలసి ప్రయాణం చేసినా
ఏ బంధమూ వెంట రాదన్న వేదాంతం తెలిసినా
పిచ్చి మనసు కలత పడుతూనే వుంది.
అంతర్మదనం చిలుకుతూనే వుంది.
అందుకే కావాలనిపిస్తుంది నాకు మరణం చిరునామా
మనసును సమాదానపరుచుకునేందుకు
పుణ్య,పాపాలు మూట కట్టుకునెందు కు !
బంధాలకు స్వస్తి చెప్పేటన్ దుకు !
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
మొదటిసారి మీ బ్లాగు చూసా. Heart Touching post.మీ అమెరికా ధ్యానం మాత్రం చదివాను.నవ్వొచ్చింది :).మిగతావి చదవాలి. రాస్తుండండి వీలయినప్పుడల్లా. అలాగే వివిధ సంకలినులకి(మాలిక,జల్లెడ,కూడలి) కూడా పంపండి మీ బ్లాగు ని.
నిజం. చాలా బాగా చెప్పారు.
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు.
లక్ష్మిరాఘవ గారు,
ఆత్మీయుల మరణాలు మనసుని కలచి వేస్తాయి, దానిని మాన్పే శక్తి కాలానికి మాత్రమే వుంది. చనిపోయిన వారు అదృష్టవంతులే....వారి జ్ఞాపకాలతో బతికున్న మనమే ఏమి చేయలేని నిస్సహాయులం...తట్టుకోవడం కష్టమే కాని తప్పదు కదండీ...
మరణం చిరునామా తెలియడం అంటే మాటలా...
గొప్ప గొప్ప వాళ్ళే కనుక్కోలేకపోయారు.
చిరునామా తెలియని భ్రమలో వుండబట్టే మనందరం అంతా శాశ్వతమని మూర్ఖంగా నమ్ముతున్నాము.
అందుకే అప్పుడప్పుడయినా ఆశావాదాన్ని అనుసరిస్తున్నాం
ఆశే లేకపోతే మరింక మనుగడకి అర్ధం లేదు కదా..
జీవించినన్నాళ్ళూ గోరంత ఆశతో నీ కర్తవ్యం నిర్వహించాలని పెద్దలు చెపుతుంటారు.
ఆత్మీయుల మరణం అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుంది. గుండె రాయి చేసుకోక తప్పదు. కాలం గాయం యొక్క పచ్చిదనాన్ని మాన్పుతుంది తప్పితే గాయాన్ని మాన్పలేదు. "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు-వున్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు" అన్నట్లు వున్నవాళ్ళ కోసం దుఃఖం దిగమింగుకోక తప్పదు. మీ టపా లో మీరు వ్యక్తపరచిన బాధ చూసి నేను ఇలా రాస్తున్నాను. మరోలా భావించవద్దు.
మరణం చిరునామా తెలుస్తే ఇక లేనిదేముంది ?
తట్టుకోక తప్పదు ఏం చేయగలము ?
#Rishi gaaru,# kotta paaLi gaarua,
#thanks#
'Death' was just a word for me until recently.Nanna's passing away was a body blow to me and my family.He was a source of strength and solace for us in good and badtimes.What we now have in his place is a gaping vacuum.An irreplacable and unfillable vacuum.May his soul rest in peace.Thanks for putting our feelings into words so beautifully.-Lakshmi Gorantla
మాలా గారు ,
పరిస్థితిని బట్టి ఒక్కోసారి ఆలోచించే శక్తిని కోల్పోతాము... నాకు నిజంగాదేవుడి దగ్గరకు వెళ్లి ఏదేదో అడిగేయ్యలని చాల అనిపించిందంటే నమ్మండి .నా మనస్తితి మారడానికి కాలమే హెల్ప్ చేస్తుంది...మీరన్నది నిజం..తట్టుకోకతప్పదండి.. ప్రయత్నం చేస్తాను ..థాంక్స్
శ్రీ లలితా గారు,
ఎవరైనా ఈ విధంగా విశ్లేషించి చెబితే కాస్త వురటగా వుంటుంది...ఈమధ్య ఎందుకో చాల సెన్సిటివ్ అయిపోతు వున్నాను...వయసు ప్రభావం కాబోలు..నేనే ఇలా అయితే మా అమ్మ ఎంత బాధపడుతూ వుందో ..థాంక్స్ ఫర్ షేరింగ్...
sri lalitha gaaru, cheppalante-manju gaaru..
thank you
లక్ష్మీ రాఘవ గారూ..
మీ పోస్ట్ ఇప్పుడే చూస్తున్నాను.
మీ మాటలు చదివేసరికి గుండె భారమైంది. మీరు ఎంత వేదనపడుతున్నారో ఆ ఘాఢత మీ మాటల్లో తెలిసింది. మీకు చెప్పేంతదాన్ని కాకపోయినా చిన్న మాట...
ప్రకృతిలో_ పుట్టడం ఎంత సహజమో... మరణమూ అంతే సహజం. కానీ బంధాల్ని విడిచిపెట్టలేనంతగా చుట్టుకున్న మనకి అవి రెప్పపాటులో మాయమైపోతే ఆ లోటు నరకమే... ఆ లోటు ఎవరూ తీర్చలేనిది.
లక్ష్మి గారూ ఈ సమయంలో మీ వాళ్ళకి కావల్సింది ఓదార్పు, సహచర్యం. అవి మాత్రమే ఆ బాధని కొంతవరకైనా మరిపిస్తాయి. మీ బాధని మీలోనే దాచుకుని... అమ్మకి, మేనకోడలికి,... మీ సహచర్యాన్ని పంచండి.
మీరు, మీ వాళ్ళందరూ ఆ దు:ఖంలోంచి తేరుకోవాలని భగవంతుని మనస్పూర్తిగ కోరుకుంటూ
మీ గీతిక
thank u geetika
Post a Comment