జ్యోతి ప్రకాశిస్తుంది
చీకటిని పారద్రోలుతుంది!
మా జ్యోతి ప్రమదావన జ్యోతి
శోదించి పరిశోధించి గెలిచింది అంతర్జాలం లో !
అందుకే ఆమె బ్లాగు గురువు !
అంతర్జాలం మెలుకువలు నేర్పిందినాకు!
కాని శిష్యురాలిగా కన్నా
అమ్మగా నిండుగా ఆశీర్వదించాలని ఆశ !
జ్యోతీ,
మీరు ఎంతో ఎ దగాలని
మీ ప్రత్యేకత అందరికి తెలియాలని,
ఇలాటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని
కోరుకుంటూ
ప్రేమతో
లక్ష్మీ రాఘవ
4 comments:
జ్యోతి గారికి నా తరుపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు
లక్ష్మిగారు, మీ అభిమానానికి ధన్యవాదాలు.
లక్ష్మి గారు,
మీరు రాసిన చిన్న కవిత చాలా బావుంది. జ్యోతి కి అన్ని చదవడానికి సమయం చిక్కలేదో, అన్ని చూసేసాననుకున్నారో. నేను కదంబమాలిక - 4 రాసాను. తను నేను రాయలేదనుకుంది. తరవాత రాసీవారిని రెడీ కమ్మని ఎవరో నోట్ పెడితే దుర్గ రాయలేదు కదా అన్నారు. నేను నా బ్లాగ్ కెళ్ళీ చూడండి ఒకసారి అని చెప్పాను. ఒకోసారి అనుకోకుండా ఇలాంటి చిన్న పొరపాట్లు జరిగిపోతుంటాయి. కానీ మీ బాధ కూడా నేనర్ధం చేసుకోగలను, అందరివి చదివినప్పుడు నా కవిత చదవలేదే అనిపిస్తుంది. నిజంగా అందరూ తనని ఎన్ని వైపుల నుండి వుక్కిరి బిక్కిరి చేసేసారు కదా! అందుకని. మీ ఆశిస్సులు మా అందరికీ కావాలండి ఎప్పటికీ.
మీరు రాసిన చిన్న కవిత అన్నారు కానీ దాంట్లో ఎంతో మంచి భావాన్ని ఇమిడ్చారు. జ్యోతికి తప్పకుండా నచ్చుతుంది చూడండి.
రాధిక, దుర్గ గార్లకు నా ఆశిస్సులు చూసినందుకు థాంక్స్ ..జ్యోతిగారు మీకు నేను ఎప్పుడూ అభిమానినే ఇంకా ఎన్నెన్నో చేయగలరు మీరు.
Post a Comment