గోరు చావు.....

గోరు చావు

గోరుకు బలంగా తగిలింది !

అమ్మా!!! అంటూ బాధతో నోరు తెరిచింది,

గోరుకింద నాళాలు నోరు తెరిచాయి !!

నరాలు బాధను మెదడుకు తెలిపాయి!

విపరీతమయిన నొప్పికి చేయ్యంతా జివ్వుమంది!!

దెబ్బతిన్న భాగాన కణాలు కూడ బలుక్కున్నాయి ,

రిపేరు చేద్దామంటూ నడుం కట్టాయి !!

గోరుకి వేలుకి మద్య రక్త స్రావమై నల్లబడింది !!

అయినా గోరుని వేలుని బంధించి వుంచింది !!!

కాని దెబ్బతిన్న గోరు మెల్లి మెల్లిగా వేరుపడినది!!

నానుంచి దూరమైనావు , ఇక నీకు మృత్యువే ‘’ అంది వేలు !!

క్రమంగా గోరు వదులు వూ డ సాగింది !!

ఒక రోజు చచ్చిన గోరు వేలును వీడింది !!

వేలు స్వేచ్చగా మరోగోరుకు పునాది వేసింది!!!

జీవితమూ అంతే!!

బంధం వున్నన్ని నా ళ్ళే అంటిపెట్టుకు వుండటం,

బంధం వీడగానే , ఆత్మ ఎగిరిపోగానే ,

శరీరానికి మృత్యువే!!

మరోచోట జననము ఖాయమే!!

చావు......జననము...నిరంతర ప్రయాణమే!!


---------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఈమధ్య దెబ్బతగిలి నా గోరు వూడి కొత్తగోరు వచ్చిన సందర్భంగా !!!!!

4 comments:

జ్యోతి said...

గోరు పోయినంతమాత్రాన ఇంతలా ఆలోచించాలా లక్ష్మిగారు.. :(

krishh said...

నిజమే
జ్యోతిగారు అన్నట్టు...గోరు చావు కు మన చావు తో
సారూప్యత ను వెతకటం అంతగా నప్పినట్టు లేదు
.బట్ ఎర్రచీమఅలక పోస్ట్ బావుంది.

Lakshmi Raghava said...

క్రిష్ గారూ
మీరు నన్ను మరోసారి ఆలోచించేలా చేస్తున్నారు!!
ధన్యవాదాలు..
జ్యోతి గారూ
వేసినపోస్ట్ ఒక్కరు చదివినాఆనందమే!!
ధన్యవాదాలు

krishh said...

thnq...
మీ ఎర్రచీమ అలకకు నేను పెట్టిన రెస్పాన్స్ చూసారా?
మీరేమంటారు....?

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template