ఎర్ర చీమ అలుక !!!!!

ఎర్ర చీమకు కోపమొచ్చింది!

కుట్టి చంపుతా అని కేక పెట్టింది!
"వద్దే చిన్నారి మనవరాలా......"
వయసులో పెద్ద చీమ గట్టిగా అరిచింది!
" ఎందుకె నేను తీపి తింటుంటే ఇంతగా విదలకొడ తారీ మనుష్యులు??? "

" తీపే కాదే, ఏ ఆహారమైనా వాళ్ళు ఇంతే!!
చీమల మందుతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు !!
నీళ్ళ ధిక్భ్ భంధన తో ప్రాణాలు తీస్తారు!
లేదా, విదిలించి చేతితో నలిపెస్తారు !"

"అందుకేనే అడుగుతున్నా
తిండి కోసం ఆశపడ్డం తప్పా?
వాళ్ళు కూడా తింటారుగా, మేము తింటే ఏం ?
మనను చూసి ఎంత నేర్చుకుంటారు,
సంఘజీవులు చీమలన్నారు !!
మన కాలనీ లను బోలిన కాలనీలు కట్టుకున్నారు !
కష్టజీవులు చీమలంటారు!
ముందు చూపు వుండాలి చీమల్లగా అంటారు!
మన రాజు- రాణి లాగ దేశాలు యేలారు!!"
మనమింత చిన్న ప్రాణులం ,
లైనుగావేడుతున్నా నెత్తిన పొడి చల్లి చంపుతారు!!
నేను కుట్టి చంపుతా!!!"
అంది కోపమోచ్చిన ఎర్రచీమ !!
పాపం దాని కేం తెలుసు మనుషులు మనుష్యులనే చంప వేనుదీయరని!!!

6 comments:

krishh said...

ఓ నా చిట్టి గండు చీమా..!
నీ ఆవేదన అర్ధం చేసుకోతగినదే ,నీ వాదన న్యాయమే

కాకపోతే ఈ ప్రపంచం లో నీతికి, న్యాయానికి మనుషులు చెప్పుకునే భాష్యం వేరు.
ఈ మనుషులు తాము ఒకరిలో ఒకరు కొట్టుకుని పూర్తిగా నాశనం అయ్యి ,ఎవ్వరు భూమి మీద బ్రతకకుండా
పోతామేమో నని భయం తో ,సాద్యమైనంతలో , నీతి, న్యాయం,ధర్మం లతో బాటు గట్టి చట్టాలను ఏర్పరుచుకుని ,గోముఖ వ్యాగ్రాల మల్లే ( వ్యాగ్రాలూ..! క్షమించాలి
యిది మాకు వాడుక పదం ,పాపం... మీరు అవినీతి,అధర్మములు కాదు.) ధర్మం నాలుగు పాదాల నడవాలని ప్రచారం చేస్తుంటారు
( వీళ్ళకీ తెలుసు రెండు పాదాల నడిచే వీళ్ళతో ధర్మం ఎలాగు వర్దిల్లదు కదా అందుకేనేమో ...)

వీళ్ళు ఆహారంకోసమే కాదు,పనుల కోసం, ఆనందం కోసం,చివరికి అందం కోసం కూడా మిగతా ప్రాణులను హింసించటానికి బంధించటానికి వెనుదీయరు.
అన్ని జీవులకు ఈ ప్రపంచం లో బ్రతికే హక్కు ఉందన్న విషయాన్ని విస్మరిస్తూ... ... ... మనుషుల్లో మాత్రం తారతమ్యాల నిర్మూలనకు పాటుపడుతూ
మనుషులంతా సమానమే అంటారు.
మీకు మా అంత ఆలోచన పరిధి పెరిగి మీ హక్కుల కోసం ప్రశ్నించినప్పుడు, అదీ మీ నుండి మాకు THREAT వుంది అనిపిస్తే అప్పుడు,
మనుషులు, చీమలు ఇద్దరు సమానమే అనడం మొదలుపెడతారు.
అంతవరకు మీరు పుట్ట దాటి వస్తే మీ ప్రాణాలకు NO GUARANTEE .

Lakshmi Raghava said...

krish gaaru ,
మీ లాగా కామెంట్ ఇస్తుంటే మాకు ఇంకా ఉచ్చాహం వచ్చేస్తుంది!!!last paragraph లో మీ రూ రాసింది ఎంతనిజమో....అన్నీ తెలిసిన మనం ఎందుకు మారము ??? ఆలోచించాల్సిందే!!
thank u so much krishh garu

Unknown said...

mee erra cheema kavita chaala bagundi. a cheemake chadive avakasam unte meeku tappaka namaskaristundi.
http:/kallurisailabala.blogspot.com

Lakshmi Raghava said...

thank u sai balagaru

krishh said...

sailabala gaaru well said

యెర్రంశెట్టి’s వాయిస్.... said...

cheema avedananu chakkaga chepparu.

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template