స్వే చ్చ కొసం

..

తురుపుముక్క లో మురళి గారి కాన్సెప్ట్ అర్టం అయ్యాక కథను ఇంకోవిధంగా ఆలోచిస్తే ఎలా వుంటుంది అన్నది రాయటం ఒక అవకాసం గా భావించి రాయడానికి వుచ్చాహ పడ్డాను. ఇంకో కారణం కూడా వుంది. కొన్నేళ్ళ క్రితం “ప్రేమ” అన్న నవలను యుద్దనపూడి, యండమూరి, మరొక రచయిత్రి రాసారు..అందులో సులోచనారాణి ప్రేమ నిండి వున్న నవలను, యండమూరి ప్రపంచస్థాయి లో ఒక ప్రాబ్లం ను , మరో రచయిత్రి మరో కోణం లో అలోచించి రాసింది నన్నెంతో ఆకట్టుకుంది...ఇప్పుడు ఒక కథ చెప్పి దాన్ని తిరగ రాస్తే....అనగానే ...అబ్బ..... నాకు ఒక ఛాన్స్ అనుకుంటూ రాసాను...ఇది అందరికి నచ్చితే నేను గెలిచినట్టే.....చదివి మీ అభిప్రాయం తెలుపుతారు కదూ....

http://turupumukka.blogspot.com/2011/02/blog-post_26.html ఒక్కసారి చూడండి !

స్వే చ్చ కొసం ....... రచన-లక్ష్మీ రాఘవ -------------------------------------------------------
అలా హటాత్తుగా మాయమైపొతే ఏమనుకుంటారు? అందరు రాచి రంపాన పెట్టింది అనుకోరూ . అలా అనుకోవాలనేకదా మీ నిర్వాకం ?” రెట్టించిన గొంతుకతో హుంకరిస్తూ వుంది వర్ధని .
భర్త రాజారావు ఆమెవంక చూడలేదు . తనను కానట్టే అటు తిరిగి పడుకున్నాడు .
“ఈ ముంగి మనిషితో ఇన్నేళ్ళు కాపురం ఎలాచేసానురా దేవుడా ..దేనికి వులకడు పలకడు !!”మళ్ళి మొదలు పెట్టింది వర్దని. వద్దనుకున్నా వినిపిస్తున్న ఆ మాటలకు నవ్వు వచ్చింది రాజారావుకి . గయ్యాళి భార్యతో తను ఎలా కాపురం చేసాడు ? దేనికైనా మాట్లాడాడా?? అమ్మ చాటున ఎలా పెరిగాడు తను? చిన్నప్పుడే తండ్రి చనిపోతే అమ్మ ఎంత కష్టపడి చదివించింది తనను ? అమ్మ కొసం, అమ్మను నొప్పించకుండా ఎలా నడచు కున్నాడు తను? చివరికి అమ్మ జబ్బు పడిపోయినప్పుడు వర్ధని సంబంధం వస్తే “వద్దమ్మ మనకు డబ్బున్న వాళ్ళ సంబంధం “ అని చెబితే “ రాజా అసలే నోట్లో నాలుక లేనివాడివి , నేను పొతే ఎలా బతుకుతావో అని దిగులు పడుతుంటే ఈ సంబంధం వచ్చిందిరా ....కలిగిన కుటుంబం ..ఐతే.. పిల్ల కాస్తా లావుగా వుంటుందిట..అందుకే మన వరకు వచ్చినారు. పైగా ఇల్లటం కావాలని వాళ్ళ కోరిక ..నీకు నేను పొతే నీకు ఎవరూ లేరురా.. ఇల్లటం పోయినా నీకూ అంటూ ఒక కలిగిన కుటుంబం వుంటుంది ..నా మాట కాదనకు” అని చెప్పి ,చేతులో చెయ్యేసి వొప్పించి పెళ్లి చేసిన నెలలోనే చనిపోయింది అమ్మ . అమ్మ పోయిన లోటు కన్నా వర్ధని చేసే పెత్తనం భరించడం కష్టం అయ్యింది రాజారావుకు .అయినా అమ్మ మాటకోసం చేసుకున్నాను ..అంతే ....అని జీవించసాగాడు .
ఇంట్లో ఏమాత్రం మాట జరగదు..దేనికైనా ఇలా చేస్తే బాగుంటుంది అనగానే “నీకు తెలియదు వూరుకో “ అనేది వర్ధని .
భర్తని నువ్వు అని సంభోదిస్తే ఇబ్బంది అయ్యేది కొత్తల్లో ..తరువాత అలవాటైంది .
.కొడుకు పుట్టాడు కాని వాడిని తండ్రి దగ్గర చేరనియ్యకుండా అంతా తానే అయ్యింది వర్ధని ..అందుకే వాడికి కూడా అలుసయ్యింది తండ్రి అంటే.....
ఈరోజు జరిగిన సంఘటన రాజారావు ని క్రుంగ దీసింది ..
.అసలేమయ్యిందంటే......
కొడుకు పెళ్లి చూపులకి వెళ్ళాలి .. “నీవు ఇంటి దగ్గరే వుండు ..నేను వాడు వెడతాం “ అంది.
మొదటిసారిగా “ నేను వస్తా “ అన్నాడు
“ నిన్ను చూస్తే వాళ్ళు పిల్లని ఇవ్వరు కూడా “
“ఎందుకు ?” అలా అడిగాడు అంటేనే ఆశ్చర్యంగా వుంది !!
“ నీవొక మనిషిలా మాట్లడగాలవా ? దేనికి నోరు తెరవలేనివాడివి ..అక్కడ మాట్లాడి సంబంధం చెడ గోడ తావు . అంతే!”
అంటే ఇలా పెంచిన కుక్క లాగా పడి వుండాల్సిందే నా ? దానికైనా మొరగడానికి స్వాతంత్రం వుంటుంది ....బాగా కోపం వచ్చింది రాజారావుకు ..వర్ధనిని ఎడా పెడా తిట్టేయ్యాల అనిపించిన్ది కాని అదిచేయ్యలేక తన నిస్సహాయ స్తితి కి ఏడు పు వచ్చింది .. అందుకే చెప్ప చెయ్యకుండా బయటకు వెళ్ళి పోయాడు ..నడుస్తుంటే కొంచం ఆవేశం తగ్గింది .కానీ వూ రికి దూరంగా వచ్చేసినట్టు అనిపించింది. అక్కడక్కడా గుడిసెలు వున్నాయి. గుడిసేలముండు స్వేచ్చగా ఆడుకుంటున్న పిల్లలు!! వాళ్ళకున్న స్వేచ్చ తనకు లేకపోయింది !!అనుకుంటూ అక్కడే వున్నా ఒక బండమీద కూర్చున్నాడు ...
గుడిసెల దగ్గరనుండి ఒక అత ను వచ్చి” ఏమీ అయ్యా వాకింగు వచ్చారా “ అని అడిగాడు.
అవునన్నాడు... ఇంకేమి చెప్పలేక... “అయ్యా చదువుకున్నోరిలగావున్నారు ...మా పిల్లకాయలకి సదువుకోవడానికి ఇస్కూలు పెట్టిన్చినారు గాని బడి పంతులు ఎవరూ రాలేదు ఇప్పటికి సంవచ్చరమాయే ...ఎవ్వరికి సేప్పుకోవాలో తెలియదు ..కొంచం సాయం సేయ్యండి “ అన్నాడు .
.రాజారావు సరే అన్నాడు .. రేపు మళ్ళి వస్తాలే “అని చెప్పాడు అనుకోకుండా ..
తిరిగి ఇంటికి నడచుకు వచ్చేసరికి నాలుగు గంటలు ఇంటికి దూరంగా వుండి పోయినట్టు వర్ధని మాటలవల్ల తెలిసింది వెనక్కి వచ్చిన రాజారావును గట్టిగా అరుస్తూ మరీ తిట్టింది వర్ధని !!
“అలా వెళ్ళిపోతే పెద్ద గుర్తింపు వస్తుందని కున్నవా..నీ గుర్తింపు అంతా వర్ధని మొగుడుగానే ..అదే నీ బతుకు !!” ఒక్కసారి గుచ్చు కుందా మాట ...
నిజమే ఇన్ని రోజులు భార్యను వదలి బయటకు వెడితే సమాజం లో బాగుండ దనే సహించాడు ..అందుకు మిగిలిందేమిటి ?
భార్య ప్రేమ చూపదు.....కొడుకును దగ్గరికి చేరనివ్వదు ..అందరు వుంటారని అమ్మ అనుకుంది కాని తానూ ఎప్పటికి ఒంటరిగానే మిగిలి పోయ్యాడని తేలిపోయింది ..
అతను మొదటిసారిగా ఏమీ చెయ్యాలని ఆలోచించడం ప్రారంభించాడు ...
నాలుగు రోజులు గడిచాయి ..పెళ్లి చూపులు అయ్యాయి ..సంబంధం ఖాయం చేసింది వర్ధిని . కానీ ఖాయం అయ్యిందని కూడా చెప్పలేదు భర్తకు .... Engagement అని రెండు మూడుసార్లు ఇంట్లో వినపడింది .ఎప్పుడూ అని అడగాలని అనిపించలేదు !!
ఈలోగా రెండు సార్లు గుడిసేలదాకా వెళ్ళి వచ్చాడు ..వాళ్ళు ఎంతో ఆప్యాయతతో మాట్లాడుతుంటే ఎంతో సంతోష పడ్డాడు ..వారితో మాట్లాడుతూ సలహాలు ఇస్తుంటే తనను వర్ధని ఎంతగా అణచి పెట్టిందో అర్టం అయ్యింది .
. “ రేపు పొద్దున్న Engagement 10 గంటలకి తయ్యారుగా వుండు “ రాత్రి పడుకునే ముందు చెప్పింది వర్ధని .
“నేనెందుకు?” మెల్లిగా అన్నాడు
“నాకూ మొగుడు ఒకడు వున్నాడని తెలియ చేయడానికేలే “ నిర్ల క్ష్యంగా అంది వర్ధని తరువాత మాట్లాడలేదు రాజా రావు .
.రాత్రి బాగా ఆలోచించాడు .. తెల్లారగానే తొందరగాలేచాడు ..స్నానం చేసి రెడీ అయ్యాడు .తను దాచు కున్న డబ్బు జేబులో పెట్టు కున్నాడు . వర్ధని బాగా నిద్ర పోవడం మరోసారి చూసి నెమ్మదిగా కదిలాడు బయటకు .. తన అవుసరం ఇక్కడి కంటే గుడిసెల వారి దగ్గరే చాలా వుంది అనుకుంటూ ముందుకు సాగాడు , engagement లో తను లేకపోయినా manege చెయ్యగల వర్ధిని జీవితం నుండి శాశ్వతంగా తప్పుకుంటూ...........

8 comments:

Anonymous said...

Good story with social consciousness

శ్రీలలిత said...

మీ కోణం కూడా బాగుందండీ...
బాగా రాసారు..

మాలా కుమార్ said...

బాగా రాసారండి

Lakshmi Raghava said...

అనానిముస్ గారు,శ్రిలలితగారు , మాలకుమార్ గారు ధన్యవాదాలండి.
మాలా గారి కామెంట్ ఆలస్యమైంది ఏమిటా అనుకున్నాను.

vallisarvani said...

చాలా బాగుందండి.

Lakshmi Raghava said...

ధన్యవాదాలు ..ఎవరైనా బాగుందని చెబితే ఈ వయసులోకుడా కిక్ వస్తుందండీ

krishh said...

అబ్బా ఎంత బాగా వ్రాసారండి... ... !
మీ blog లో నేను ఇది ౩ వ పోస్టింగ్ చదవటం.
"ఎర్ర చీమ అలుక " పర్లేదే బాగుంది అన్పించింది.తర్వాత "గోరుచావు" చూసి ,
మ్హ్చ్... ... not impressive ...అనుకున్నా... ... ,but "స్వేచ్ఛకోసం" ,really remarkable అండ్ So impressive .
కథనం సాగతీత లేకుండా,అనవసర వర్ణన లేకుండా,స్పష్టం గ వడివడి గ మనస్సు స్పందిచే విధం గ నడిచింది.
సన్నివేశాలు,రాజా రావు గారి feelings కళ్ళకు కట్టినట్టు ఉన్నాయంటే నమ్మండి.

"వయస్సుతోకాదు... ... ఉత్సాహం తో "అని మీరు blog కు పెట్టుకున్న tag line లాగానే రాజారావు గారు తన ఆ వయసులో మంచినిర్ణయం తీసుకున్నారు...
ఆయన జీవితం ఉల్లాసం గ ఉత్సాహం గ గడవాలని కోరుకుంటున్నాను...
చివరగా... ... మీరు ఇంకా ఇలాంటి చక్కటి, రచనలు చేయాలని కోరుకుంటున్నాను.
మీరు blog run చేస్తున్నారని మీఫ్రెండ్స్ అంతా తెల్సుకుని ఎక్కువ మంది స్పందిస్తే బావుంటుంది అని నా ఆలోచన.

బాటసారి said...

chaala baaga raasarandi.
Thought provoking and thnx for sharing.

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template