అత్తగారి ఆయుస్సు


        అత్తగారి ఆయుస్సు
పండుటాకు అత్తమ్మ ,
తొంబై వసంతాలు నిండి ,
దేహపు ముడతల్లో వయసు తెలిసి
నిటారుగా నిలబడే శక్తి లేక ,
ఆసరా కోసం చేతులు చాపుతూ,
అన్నం కుడా కలుపుకోలేక,
చేతులు పనిచేయ్యక,
స్పూను తిండికి అలవాటు పడుతూ
చాలు బాబూ ఈ జీవితం  అంటూ
నాలుక బయట కేసి ,కళ్ళు తే లవేసి
ఊపిరి గురగురలాడుతూ ,
స్వేచ్చ కావాలని ఎగిరిపొయె సమయాన’
గాబరా పడి కేకవేస్తే
108  వున్నపళాన వచ్చి
ఆదరంతో ఆక్సిజన్ ఇచ్చి
ఆస్పత్రికి చేరవేస్తే
ICU  లో అడ్మిటై
మృదువుగా ఇచ్చిన అనేక ఇంజెక్షన్ల తో,
వివిధ రకాల ట్యూబులతో ,
ఆవిడ అంతరంగాన వున్న ప్రతి అవయవాన్ని
 చరిచి లేపి పనిచేసేలా చేసాక ,
పదిరోజుల ICU ప్రస్తానం ముగిసి వార్డు చేరిన అత్తగారు
‘ ఇకపోదాం పద లక్ష్మి ఇంటికి’ అని వినసొంపుగా
పలికిన వేల సంతోషం నిండి
‘మరో పదేళ్లు జీవించి శతకం పుర్తిచేయ్యండి అత్తగారూ’
అని దేవుడినకోరిన వేళ
15రోజుల అలసట
ఆస్పత్రికి ఎగిరిపోయిన బరువైన డబ్బూ
ఏదీ గుర్తుకు రాలేదంటే నమ్మండి !!!

{ జనవరి 3 to 16 ,2013 రోజులలో మాఅత్తగారి అనారోగ్య –ఆరోగ్య ప్రహసనం ]


4 comments:

Anonymous said...

అక్కయ్య గారికి నమస్కారం చెప్పండి. సెంచరీ చేస్తే వెనక మేమూ ఉన్నామని చెప్పండి.

Lakshmi Raghava said...

kastephale gaaru
tappakunda nandi chebutanu maa attagaariki

పల్లా కొండల రావు said...

మీ అత్తగారు మీ కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను.

Lakshmi Raghava said...

maa అత్తగారు నిజంగా శతకం పూర్తీ చేస్తారండి ఎందుకంటే ఈ రోజుకి నలుగు అడుగులు వేసి కుర్చీ లో కూర్చుంటున్నారు మరి ! మీ కు ధన్యవాదాలు .

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template