మార్పు కు నాంది మహిళ


              మార్పు కు నాంది మహిళ
అప్పడు ---భారత దేశం లో భార్యగా త్యాగం ,
              తల్లిగా అనురాగం ,
             ఆడ జన్మ పవిత్రం ,
              అయినా తప్పలేదు కష్టాలు ,

             వరకట్నానికి  బలికాకుండా,
            కిరోసేన్ అగ్నికి ఆహుతి కాకుండా ,
             ఫ్యాను కడ్డీలను ఆశ్రయించకుండా
             బతికేదెలా అని భయపడ్డది ఆడ బ్రతుకు .

ఇప్పుడు--- ఆసిడ్ దాడులతో ,
               ప్రేమపిచ్చి ఆవేశాలతో ,
               కామ పిశాచుల కోరికలతో ,
               రాజధాని నడి  బొడ్డున
               పరాభావింప బడ్డాక ,
               వురుకోకు మహిళా

ఎందుకంటే ---శిక్షలు ప్రభుత్వానివే అయినా
                 క్రమశిక్షణ ఎప్పుడూ తల్లిదే
                 ప్రేమా అనురాగాలూ
      అణుబాంబు కన్నా శక్తిమంతాలు .
      అనురాగ మూర్తిగా చేతన కలిగించు
      అపర శక్తివై చైతన్యం తెప్పించు,
      ఇది చెయ్యగలిగేది ఒక్క ఆడదే ,
      అత్యంత శక్తి స్వరూపిణి ఆడది ,
      అబల కాదు సబల అని నిరూపించేది
     సంఘం లో మార్పుకు పునాది వేసేది మహిళే ! 


మహిళా దినోచ్చవ సందర్బంగా  రాసిన ఈ కవిత ఇన్నిరోజులకు వెలుగు చూసింది !
  

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

మీరు చెప్పినది 100% నిజం లక్ష్మి రాఘవ గారు నేరం చేసిన తర్వాత శిక్ష పడటం కాదు కావాల్సింది

నేరం చేయకుండా పెంచాల్సిన భాద్యత ఉండాలి ప్రేమాభిమానాలు ఇచ్చి సశ్చీల ప్రవరర్తన ని పెంపొందించే పెంపకం కావాలి
మహిళగా అది కర్తవ్యమ్ కూడా

బావుందండి అభినందనలు

Lakshmi Raghava said...

thank you వనజావనమాలి గారూ సంస్కారం మొదలయ్యేది ఎప్పుడు ఇంటినుండే అని నమ్ముతాను.

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template