ఈ రోజు న మా వూరిలో ఓక అద్భుతం !!

 మా రాయలసీమ పల్లెలో వడగళ్ళ వాన కురిసింది !
మా పంటలు పచ్చగా వున్నాయి !
మాకు కరెంటు కోత లేదు.!
తాగడానికి మినరల్ వాటర్ ఇస్తునారు !
పెట్రోలు ధరలు తగ్గిపోయాయి !
రైతులకు బ్యాంకుల్లో కావాల్సినంత ఋణం దొరుకుతోంది !
మా ఆడపిల్లలు అర్ధరాత్రి బయట తిరుగుతువున్నారు!
మగవాళ్ళు వారిని చూసి భయపడి పోతున్నారు!
మా ఏడు కొండల దేవుడు పదినిముషాల్లో దర్సనం ఇస్తున్నాడు!!!!!

ఎంతబాగుందో...........

అవునండీ   ఈరోజు ఏప్రిల్ ఒకటి ఎన్ని అధ్భుతాలైనా జరగవచ్చు !!
ఉహల్లో బతికేద్దాం !!!!!

7 comments:

జలతారు వెన్నెల said...

ఒక్క క్షణం నేను నిజమే అనుకున్నాను సుమండి!!!
ఏదో ఒక రోజున ఇలాంటి టపా నిజంగా రాసుకోవాలండి మనం

Lakshmi Raghava said...

ఉహలల్లో బతికేస్తే అందరు ఎంత సంతోషంగా వుంటారు కదండీ .థాంక్యూ

వనజవనమాలి said...

లక్ష్మి రాఘవ గారు . నేను నిజమనే అనుకున్నాను. సగం చదివేవరకు . ఆవేదన అర్ధం అయింది సింపుల్గా చురక. ఎవరికీ వేయాలో తెలియదు కదా!

ప్చ్ :(:(

Lakshmi Raghava said...

maaku ఇది కావాలి అని చెప్పే రోజులు పోయాయి వనజా వనమాలిగారు . రోజుకో బండ నెత్తిమీద వేస్తుంటే బాధతోనే ఈ చురక ! కానీ ఆర్చేవారు తీర్చేవారు ఎవరూవుండరు....థాంక్స్ నా తో బాధను పంచుకున్నందుకు ..
లక్ష్మి రాఘవ

మాలా కుమార్ said...

ఏమి అద్భుతమా అనుకున్నాను . హుం ఊహ చాలా అందంగా వుంది .

Lakshmi Raghava said...

ధన్యవాదాలు మాలా గారూ

Sharma said...


ఇలా ఉంటే బాగుంటుంది కానీ అలా ఉండదు కదా !కనుక ఇలా ఉంటే బాగుంటుందని ఫీలవటమే మనకు కరెక్ట్.

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template