ఏమిటీ ఈక్వెషన్?

అమ్మాయిలు అమెరికా లో
అమ్మలూ, నాన్నలూ భారతావని లో
మార్పుకీ, సాయానికే  గాని తప్ప రావాలనిపించదని పెద్దలూ...
ధనమూ, సౌఖ్యమూ బాగున్నాయనుకునే  పిన్నలూ...
అనురాగాలూ, ఆప్యాయతలూ తక్కువేమె లేవు  !
కానీ ఎవరి పరిధి వారిదే
ఏమిటీ ఈక్వెషన్?
ఎక్కడ వుంది సొల్యుషన్?
ఇలా  ఆలోచించక  తప్పడం లేదు  పరాయి దేశం వచ్చినప్పటి నుండీ
ఎందుకింత మమకారం మన దేశం పై?

2 comments:

Padmarpita said...

ఏదైనా దూరమైతేనేగా తెలిసేది

Lakshmi Raghava said...

nijame padmarpita

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template