అమెరికా లో ధ్యానం
-------------
అమెరికా లో అన్నిటికంటె నచ్చింది కంఫ్యూటర్ 24 గంటలూ అందుబాటు లో వుండటము.యూ టూబు లో రకరకాల స్వామీజీల ప్రసంగాలు వినడం,రకరకాల ద్య్హానాల గురించి తెలుసుకొవడమే కాదు వేదాంతం నుండి వంకాయ పచ్చడీ దాకతెలియచెప్పె విశ్లేషణలు .....ఇంకేమికావాలి? అందుకె అక్కడ వుండ బోతున్నా 6 నెలలూ హయిగా ద్య్హానం, వేదాలు , పురాణాలు అన్నీ తెలుసుకుంటూ నాలోని ఆధ్యాత్మికతను మెరుగు పరచు కోవాలని నిర్ణయించుకుని ఆ అన్వేషణ లో పడ్డాను
ఆ రోజు ఒక స్వామీజీ చెప్పిన విధంగా ఓ అరగంట కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని పడుకున్నాను .
అలా నిద్రలో జారుకుంటుంటే కప్పుకున్న రజాయిలో నాగుండె చప్పుడు నాకే వినిపించసాగింది. చెవిదగ్గర శబ్ధం లబ్ డబ్ అంటూ లయబద్దంగా తాళం వేసినట్టయింది.ఇండియా లో మా వూర్లో నాకెప్పుడూఆ ఇలా నా గుండె చప్పుడు నాకే వినిపించిన గుర్తు లేదు మరి ఇప్పుడో ? అమెరికా వాతావరణమా లేక కప్పుకున్న సింథటిక్ రజాయి ప్రభావమా?
యేదైనా అలా నా శరీరంలోని శభ్ధాలు నన్నే ఆశ్చర్య పరిచాయి
మరురోజు ....గుండె చప్పుడు మరింత ఫాస్టుగ వున్నట్టుగ అనిపించింది .ఇదేదో కొత్త ఎక్స్పిరీన్స్! నిశ్శబ్ద్దమైన వతావరణంలో చెక్క ఇళ్ళల్లో సంకొచ వ్యకొచ శబ్ద్దాలు అలవాటైనట్టె నా గుండె చప్పుడు నాకు అలవాటవసాగింది.బహుశా ధ్యానంలో ఒక మెట్టు పైకివెళ్ళానెమో !మనసులోని ఆలోచనలను దూరం చేసుకునే కార్యక్రమంలా శరీరం లోని శబ్దాలు కూడా ఇలా వినపడుతూ చివరికి దూరం ఐ మనసు నిర్మలం చేస్తాయా? ఏమో !!
తరువాతి రోజు...
రాత్రి వొంటి గంట సమయంలో తలలో రక్తం విపరీతమైన వేగంతో పరుగెడు తున్నట్టూ ,ఎవరో తలమీద కొడుతున్నట్టూ ఫీలింగ్ !!అది ధ్యానం లో మరో మెట్టా ?? నన్ను నెను కంట్రొలు చెసుకొవడానికి నా మెదడు ప్రిపేరు అవుతోందా??
ఏది ఎమైనా చాలా అనీసినెస్ . వొళ్ళంతా నిస్సత్తువ! వేగంగా కొట్టుకుంట్టున్న గుండె !!! లేచి రెస్టు రూం కు వెళ్ళి వస్త్తె చాలా నీరసంగా అనిపించింది .ఒక పెయింకిల్లర్ టాబ్లెట్టు వెసుకుంతే కొంచం నయం అనిపించింది కాస్సెపటిలో వొళ్ళంతా చల్లబది చెమట పట్టింది .
పొద్దున్నే లేచి నా కూతురికి రాత్రి ఎందుకో ఇలా జరిగింది అనగానే వుండు అంటూ బి.పి మిషను పెట్టి చూసి 'ఒహ్ 190/90 వుంది ముందు బి పి టబ్లెట్టు వెసుకో ..నయం ఇప్పుడైనా చెప్పావూ అని కోప్పడింది !!
అరే ఇది బి.పి వల్లనా !!! ఇంకా నేను ధ్యానం లో ఎదుగుతున్నాను అని అనుకున్నాను బి.పి లో ఎదిగిపొతున్ననని తెలియలెదూ అని కూతురికి చెప్పలెదు. ఆరోజు నుండి వుప్పులేని కూడు తొ ఆరోగ్యం కూడదీసుకునేందుకు ప్రయత్నం చేసా!!!
ఇదండీ నా అమెరికా ధ్యానం !!!!!!!!!!!

2 comments:

నిడదవోలు మాలతి said...

బాగుందండీ మీ అమెరికాధ్యానం.
రచన మొదలుపెడుతూనే రెండుకథలు బహుమతులు పొందడం విశేషం. మీరింకా ఇంకా మంచికథలు రాయగలరని ఆశిస్తున్నాను.
కొంతకాలం ఒక బామ్మ అంటూ నాకు ఒక మెయిలు వచ్చింది. మీరే అనుకుంటున్నా. పొరపాయితే క్షమించగలరు.
ఈమాట.కాంలో నాకథమీద మీ వ్యాఖ్య చూసాను. మీరు అమాయకులండీ. ఇప్పుడు కథలో రచయిత ఏం చెప్పేడు అని చూసేవారికంటే రచయితకి మనం ఏం చెప్పగలం అని చూసేవారు ఎక్కువ అవుతున్నారు ...

Lakshmi Raghava said...

thank u maalathi gaaru

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template