నా కంప్యూటర్ ప్రయాణం


      నా కంప్యూటర్ ప్రయాణం
తెలియదు నాకు కంప్యూటర్ ప్రపంచం చాలా కాలం !
అమ్మాయికి అవసరమని అమెరికా వెడితే
ఇంట్లో కంప్యూటరు 24 గంటలూ ఇంటర్నెట్టూ!!
ఇంకేం అనుకునీ email  నేర్చుకున్నా
కానీ మెయిలు చూసుకునేలా స్నేహితులు ఎదగలా...
అప్పుడు అమ్మాయి google serch  నేర్పింది!
సెర్చి చేసి వివిధ విషయాలు తెలుసుకో బోయా..
అప్పుడు  అల్లుడు చెప్పాడు బ్లాగుల ప్రపంచం గురించి ,
నాపేరిట ఒక బ్లాగు చేసి రాసుకోండి మీరు రచయితలుకదా అన్నాడు
నా బ్లాగు నాయిష్టం ఏదైనా రాసుకోవచ్చు కదా అని
నా మనో భావాలను రాసుకున్న ...కానీ  చదివేది ఎవ్వరు?
కొన్ని నెలల తరువాత నా బ్ల్లాగు ఎవరూ చూసిన పాపాన పోలే ..
ఏమిచెయ్యాలో తెలియలా .....
“నిరాశే మిగిలింది “ అని రాసుకున్నా  ఆపై
తెలుగు బ్లాగులేవైన వున్నాయా అని సెర్చ్ చేశా
అప్పుడు తెలిసింది తెలుగు బ్లాగుల “సంకలినుల” లోకం
అలా  చూస్తుంటే కనిపించింది ఓక బ్లాగులో  ‘కథలకు విశ్లేషణ చెయ్యండి ‘
విశ్లేషణ చేసిపంపితే లింకు పంపండి అన్నారు
నాకు లింకు లివ్వడం రాదు అని రాసా ,
అప్పుడు తారసపడ్డారు “ బ్లాగూ గురువు “ జ్యోతీ
ఆమె పాఠాలు శ్రద్ధగా చదివా ..కొన్ని నేర్చుకున్నా
నా  బ్లాగుని అందంగా తీర్చిదిద్దింది జ్యోతి..
ప్రమదావనం లో చేరాక బ్లాగుల ప్రపంచం మరింత తెలిసింది !
ఇతరుల బ్లాగులను చూస్తే నేనూ  అలా  పరుగులు తీయగాలనా అని దిగులేసింది .
ఒక బ్లాగు ప్రవేశించగానే “హలో.. వెల్కం ‘ అంటారు
ఇంకొకరు చక్కటి పాటతో పలకరిస్త్తారు !
మరొకరు “ టైము ఇదీ “ అని గడియారం చుపిస్త్తారు !
“మీరు వచ్చారా  అంటూ ..”విజిటర్ ఎక్కడనుండో” అని లిస్టు చూపుతారు!
కూడలి..హారం జల్లెడ అంటూ వారెక్కడ గుర్తింపబడ తారో తెలుపుతారు !
దాని కింద  followers  అని ఫోటోలు చూపుతారు !!!
వామ్మో .....నాకేమి తెలియదే అనుకుని భయపడ్డా
బ్లాగు గురువుని ఆశ్రయించి ‘వీక్షకులను “ చేర్చుకున్న
నాలుగేళ్ల నా బ్లాగు ప్రయాణం తరువాత ..
నెల క్రితం followers చేర్చుకున్నా ..అయినా నా పిచ్చి గాని
నా బ్లాగునేవారు ఫాలో అవుతారు అని సందేహపడ్డ
ఆశ్చర్యంగా ఇద్దరు followers చేరారు నిన్నటికి !!
అందరిలా పరుగులు తీయక పోయినా ,
అన్నీ బ్లాగులలో వున్న విశేషాలు చేర్చుకోలేకపోయినా ,
విశ్రాంత జీవనం గడుపుతూ కరెంటు కోత వున్న పల్లెటూరిలో వున్నా
అమ్మాయి ఇచ్చిన లాప్ టాప్ తో వారానికి రెండు రోజులే internet చూసుకుంటున్నా
ఎంజాయ్ చేస్తున్నా అందరి బ్లాగులను చూస్తూ ,
రాస్తున్నా అంతర్జాల పత్రికలలో ,
64 ఏళ్ళ వయసులో నేర్చు కుంటూనే వున్నా
 నాకు తెలియని  కంప్యూటర్ ప్రపంచాన్ని..... ఎదగాలనే ఆశ తో
మీరిప్పుడు ఇదీ చదివారంటే ఎగిరి గంతేసి
ఒలంపిక్ మెడలు గెలుచుకున్నా  నన్న మాటే మరీ!!




16 comments:

శ్రీలలిత said...

హై జంప్ లో మీకు బంగారు పతకమే...
శుభాకాంక్షలు...

Lakshmi Raghava said...

మీరు చూసారంటే బంగారు పతకమే మరీ ..ధన్యవాదాలు శ్రీలలితా

Yogi said...

mee blog guru jyoti gari blog peru emitandi Lakshmi raghava garu..?

భాను కిరణాలు said...

బామ్మగారు మీ బ్లాగ్ ని హారం లో నేను ఇప్పుడే చూసాను ... ఇక నుండి నేను మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను ..... అయ్యయ్యో భయపడకండి అదే ఇక నుండి నేను కూడా మీ బ్లాగ్ ఫాలో అవుతాను అని ........ మీ రచన శైలి చాలా బాగుంది

Padmarpita said...

వావ్....సాగిపొండి ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా!:-)

సురేష్ said...

బామ్మ గారు, నమస్కారం. మీ ఈ పోస్ట్ చదివాను. చాలా బాగుంది. :) మీలాంటి బ్లాగర్స్ అందరికీ ఓ స్పూర్తిదాయకం.

మీకు ఉపయోగపడే ఈ కొన్ని లింక్స్: http://www.nerpu.com/blogging-blogger/ http://www.superblogtutorials.blogspot.in/

Lakshmi Raghava said...

యోగి గారూ, పద్మగారు సురేష్ గారూ
నా బ్లాగు విజిట్ చేసి నా ప్రయాణాన్ని చూసినందుకు ధన్య వాదాలు.
సురేష్ గారూ చూసారా నేనూ ఇలా రాయబట్టేకదా మీరు నా లాటి వారికీ పనికి వచ్చే సైటు చెప్పారు. చాలా వుపయోగకరంగా వుంది . inka nerchukunta eesari..thank you

యోగి గారూ
blog guruvu ani type cheyyandi jyothigari link vastundi .nenu follow avutunna nu kabatti naa blog lo kuda chudavachchu

Lakshmi Raghava said...

యోగి గారూ ,
జ్యోతీ గారి బ్లాగ్ గురువు కొసం ఈ లింక్ ట్రై చెయ్యండి

http://telugublogtutorial.blogspot.com/

వనజ తాతినేని/VanajaTatineni said...

మీ బ్లాగ్ ప్రయాణం ..చాలా స్పూర్తికరంగా ఉంది.అభినందనలు.
మీకేమిటండి.. లక్ష్మి గారు.. పసిడి పతకాలు సొంతం చేసుకుంటారు. ప్రతి రోజు రోజు ఇంటర్నెట్ చూసేయండి.
నేర్చుకుంటూ..నేర్పేయండి.

Lakshmi Raghava said...

వనజ వనమాలీ గారూ,
మీ లాగా ఎంకరేజే చేసేవాళ్ళు వుంటే ఇంకా ఉచ్చాహం చూపనా...
మీరు ఇంకో పథకం ఇచ్చారన్నమాటే !!!ధన్యవాదాలు
లక్ష్మీ రాఘవ

Lakshmi Raghava said...
This comment has been removed by the author.
Lakshmi Raghava said...

భాను గారూ ,
ధన్య వాదాలు . మీరు ఫాలో అవుతానంటే ఎంత సంతోషమో...పరుగు కి కాస్త యువ రక్తం కావాలి మరీ

నేను మీ నేస్తాన్ని said...

bammaa... meekunnaa opikaa ippudu maaku ledu andi...

yemainaa nerchukonedaaniki... vayasutho paniledu ani mimmalni choosaakaa telisindi bammaa...

Lakshmi Raghava said...

నేస్తమైన నేను గారూ ,
అబ్బ ఇన్నిరోజులకు కాస్త ఉచ్చాహం కలిగించారు...ఇంకా నేర్చుకుంటా ...మరో పదేళ్లు వెనక్కి వెడతానా? హ హా ..
ధన్యవాదాలు

Kishore said...

నమస్కారం. ఈ రోజే మీ పొస్ట్ 'ఆదికేశవులు .....' చూసాను. చాలా నచ్చింది. మీ పాత పొస్ట్ లు చూస్తూ 'నా కంప్యూటర్ ప్రయాణం' చదివాను. అద్భుతం అనిపించింది. మీ ఆసక్తికి, ఈ వయసులో మీరు సాధించిన ప్రగతికి కేవలం అభినందనలే కాదు జేజేలు పలుకుతున్నాను. ఎందుకంటే, నేను కూడ బ్లాగ్ మొదలుపెట్టాలని 2009 లొ అనుకున్నాను, కాని మొన్నటి వరకు అది జరగలేదు. (కారణం ఎలా రాయాలో తెలియకపోవడము, బ్లాగ్ గురువు లాంటి ట్యుటొరియల్స్ ఉన్నాయని తెలియకపోవడం). మీ పొస్ట్ ద్వారా కొత్త విషయాలు తెలిసాయి. ధన్యవాదములు.

ఏమైనా, ఈ మద్యనే ఒక బ్లాగ్ మొదలు పెట్టాను. దయచేసి మీరు చూసి, మీ అభిప్రాయం, ఏమైనా సలహాలు అందించగలరు.

http://kishoreprapancham.blogspot.in/

Lakshmi Raghava said...

dhanyavadaalu కిశోర్ గారు ,
చాల అవస్తలు పది ఇప్పటికి కాస్త నిలదొక్కు కున్నాను . మీకు ఉచ్చాహం కలిగించినందుకు సంతోషం అయ్యింది
లక్ష్మి రాఘవ

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template