ఆసరా తోనే జీవితం
అమ్మ కనేంత వరకు బొడ్డు తాడు ఆసరా ,
బయటకు వచ్చాక అమ్మ ప్రేమ ఆసరా ,
చదువువ కోవడానికి నాన్న
పాఠాలు ఆసరా ,
ఎదగడానికి ఉద్యోగం ఆసరా ,
డబ్బుకోసం పరాయి దేశం ఆసరా ,
సంసారపు సుఖాల కోసం భార్య ఆసరా ,
సంతోషాలను పంచి ఇచ్చేందుకు పిల్లల ఆసరా ,
వారి ఉద్యోగాల పేరుతో ‘ఆశ’ ఆసరా,
రిటైర్మెంట్ తరువాత పెన్షను ఆసరా ,
భార్యా వియోగంతో కొడుకు పంచన చేరితే కోడలు ఆసరా,
కోడలి ‘రుస రుస ‘ తో బాధ ఆసరా
,
ఒత్తిడిలో స్వాంతన కోసం ‘ మద్యం’ ఆసరా ,
మృత్యువు దరిచేరబోయినప్పుడు ‘మోక్షం’
కొరకు దేవుడి ఆసరా ,
పునర్జన్మ తో మళ్ళీ కొత్త జీవితం ఆసరా!
4 comments:
నిజమే బ్రతుకు బుడ్డీ లో ఆఖరి సిరా చుక్కదాకా ఆసరానే!
మీరన్నది నిజం చిన్ని ఆశ గారు .ధన్యవాదాలు
అంతేనండొ ఆసరా తోనే జీవితం . బాగుంది .
ఆలోచిస్తే ఇంకా ఎన్నో ఆసరాలు వున్నాయి.ధన్యవాదాలు మాలా గారు
Post a Comment