ఆసరా తోనే జీవితం


            ఆసరా తోనే జీవితం
అమ్మ కనేంత వరకు బొడ్డు తాడు ఆసరా ,
బయటకు వచ్చాక అమ్మ ప్రేమ ఆసరా ,
చదువువ కోవడానికి  నాన్న పాఠాలు ఆసరా ,
ఎదగడానికి ఉద్యోగం ఆసరా ,
డబ్బుకోసం పరాయి దేశం ఆసరా ,
సంసారపు సుఖాల కోసం భార్య ఆసరా ,
సంతోషాలను పంచి ఇచ్చేందుకు పిల్లల ఆసరా ,
వారి ఉద్యోగాల పేరుతో ‘ఆశ’ ఆసరా,
రిటైర్మెంట్ తరువాత పెన్షను ఆసరా ,
భార్యా వియోగంతో కొడుకు పంచన చేరితే  కోడలు ఆసరా,
కోడలి ‘రుస రుస  ‘ తో బాధ ఆసరా ,
ఒత్తిడిలో స్వాంతన కోసం ‘ మద్యం’ ఆసరా ,
మృత్యువు దరిచేరబోయినప్పుడు  ‘మోక్షం’ కొరకు దేవుడి ఆసరా ,
పునర్జన్మ తో మళ్ళీ కొత్త జీవితం ఆసరా! 

4 comments:

Unknown said...

నిజమే బ్రతుకు బుడ్డీ లో ఆఖరి సిరా చుక్కదాకా ఆసరానే!

Lakshmi Raghava said...

మీరన్నది నిజం చిన్ని ఆశ గారు .ధన్యవాదాలు

మాలా కుమార్ said...

అంతేనండొ ఆసరా తోనే జీవితం . బాగుంది .

Lakshmi Raghava said...

ఆలోచిస్తే ఇంకా ఎన్నో ఆసరాలు వున్నాయి.ధన్యవాదాలు మాలా గారు

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template