జీవితం లో పరుగు
జీవితమే ఒక పరుగు !!!!!!!!!!!
చిన్నప్పుడు ఏడిస్తే అమ్మ పరుగు ,
ఆ పై రొజూ స్కూలుకు పరుగు ,
స్కూలు నుండి ఇంటికి వస్తే ట్యూషన్ కు పరుగు,
అందంగా కనిపించాలని హెయిర్ కట్టింగ్ కు పరుగు ,
ఇంకా బాగా కనపడాలని బ్యూటీ పార్లర్ కి పరుగు
ఇంత అంద మా అని అబ్బాయిలు అమ్మాయిల వెంట పరుగు ,
ఇంటర్ లో చేరితే చదువుల వెంట పరుగు ,
ఇంజనీరో , డాక్టరో కావాలని కోచింగుల వెంట పరుగు ,
ఆపై కౌన్సలింగులో కాలేజీల వెంట పరుగు ,
బాగా చదవాలని తలిదండ్రుల మాటల పరుగు ,
వయసు వికసించి ఆకర్షణలు ఎక్కువై ప్రేమవెంట పరుగు
ఎలాగో చదువులు ముగిసి ఉద్యోగం కొసం పరుగు ,
ఉద్యోగం లో ఎదగాలని నేర్పరితనానికై పరుగు ,
నాలుగు జీతాలు తీసుకోగానే పెళ్లి చూపులకై పరుగు
పిల్ల నచ్చితే పెళ్లి కోసమై పరుగు ,
సహజీవనంలో హృదయనందపు పరుగు ,
మరో రెండేళ్ళ లో చిన్నారి జననం కొసం పరుగు ,
బోసినవ్వుల ఆస్వాదనలో ఆనందపు పరుగు ,
తరువాత స్కూలు అడ్మిషన్ కొసం పరుగు ,
ఆపై స్కూలు ఫీజుల డబ్బులకోసం పరుగు ,
స్కూలు పూర్తి చెయ్యబోయే కూతురి భవిష్యత్తు కై ఆలోచనల పరుగు
పై చదువులు అయ్యాక , ఉద్యోగా అన్వేషణ లో పరుగు ,
ఆ పై అల్లుడి వేటలో పరుగు
పెళ్లి అయ్యాక వాళ్లి ద్దరు అమెరికా ఉద్యగాలకై పరుగు ,
మనమల ముచ్చట్లు చూడలేకపోయమే అన్నీ బాధ పరుగు .
పదవీవిరమణ తో విశ్రాంత జీవనం కొసం పరుగు ..
పిల్లల కోసం అమెరికా వెళ్ళాలా అన్న ఆవేదన పరుగు ,
అందరు కలసి వుండలేకపోయామే అన్న యోచనతో పరుగు
దేశాన్ని వదలి పోవడం ఇష్టం లేక ,ఆద్యాత్మికతలో స్వాంతన పొందాలని పరుగు,
ప్రశాంతత విలువ తెలిసేసరికి చావు కై పరుగు ,
మృత్యువుతో ఆగిన పరుగు !!!!!!!!!!!!!!!!!
2 comments:
చాలా చాలా బాగుంది... అండీ..
మెత్తం మీద జీవితం అంతా పరుగులమయం అనీ దానికి అంతం మరణం అని భలే చెప్పారు..
ధ్యాంక్యూ..
థాంక్ యు సాయి...బహుశా బాగా తెలిసి అనుభావిన్చాకే ఇదే అంతం అని రాసానేమో
లక్ష్మీ రాఘవ
Post a Comment